Narendra modi targeted gandhi family

narendra modi, bjp, prime minister, president, gandhi family

narendra modi targeted gandhi family

narendra-modi-on-gandhi-fam.png

Posted: 03/03/2013 04:46 PM IST
Narendra modi targeted gandhi family

narendra-modi-gujarat-cm

ఈరోజు ఢిల్లీలో జరిగిన ఆఖరు రోజు భాజపా జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశంలో, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ఎన్నుకున్న నరేంద్ర మోదీ, అందరూ ఊహించిన విధంగానే పాలకపక్షం మీద, గాంధీ కుటుంబీకుల మీదా విమర్శనాస్త్రాలను సంధించారు.  ఆ వాతావరణంలో అంతకంటే ఏమాట్లడగలరు ఎవరైనా.  ఒకవేళ ప్రభుత్వాన్ని సమర్థిస్తే ఆ స్థానంలో ఎవరున్నా వారికి అక్కడ మనుగడ ఉంటుందా. 
అధికారపక్షం ఏకైక లక్ష్యం గాంధీ కుటుంబాల సంరక్షణే కానీ దేశ ప్రజల సౌభాగ్యం కాదంటూ మోదీ విమర్శించారు.  ఇప్పుడూ ఆ పార్టీని తరిమికొట్టటం మరో స్వాతంత్ర సమరమౌతుందని ఆయన సూచించారు.  ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని గాంధీల చేతుల్లో కీలుబొమ్మగా అభివర్ణిస్తూ, ఆయన నిజాలను చూడకుండా వాటికి దూరంగా ఉంటూ, గాంధీ కుటుంబానికి రాత్రి పూట పనిచేసే వాచ్ మన్ గా వ్యవహరిస్తున్నారని, కాకపోతే ఆ రాత్రి సుదీర్ఘమై ఎంతకీ తరగటం లేదని చమత్కరించారు. 
అసలు ప్రస్తుత రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాన మంత్రిని ఎందుకు చెయ్యలేదో తెలుసా.  ఆయనకు కొన్ని నియమనిబంధనలున్నాయి.  ఆయన ప్రజా సంక్షేమంలో కాస్త చేసి చూపించగల సత్తా ఉంది.  అదే జరిగితే గాంధీ కుటుంబం పరిస్థితేమిటి.  అందుకే అతన్ని ప్రధాన మంత్రి పదవికి దూరంగా ఉంచారు అన్నారు మోదీ.
కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాతనే గద్దెనెక్కగలిగిన మొరార్జీ దేశయ్, చంద్రశేఖర్, విపి సింగ్ ల ప్రస్తావన తీసుకొచ్చారు.  కాంగ్రెస్ ని వెళ్ళగొట్టటంలో నిజమైన దేశభక్తి ఉందని, అలా జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని చెప్తూ, ఆదర్శంగా గుజరాత్ ని తీర్చిదిద్దామని, దాన్ని నమూనాగా తీసుకుంటే దేశ సౌభాగ్యం ఎందులో ఉందో అర్థమౌతుందని మోదీ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles