Shatrughan Sinha Meets Nitish Kumar

Shatrughan sinha meets nitish kumar

Shatrughan Sinha, Nitish Kumar, Bihar, Bihar results, Bihar elections, BJP, Lalu Yadav, JD(U), RJD, Grand Alliance, Grand Alliance in Bihar

It's personal, said Shatrughan Sinha as he drove up to meet man of the moment Nitish Kumar, who will be Bihar's chief minister for a third term after a humongous victory in the assembly elections on Sunday. The 'Grand Alliance' that Nitish Kumar led in the election crushed Shatrughan Sinha's party the BJP, winning 178 of the 243 seats. The BJP's alliance could manage to win only 58.

నితీష్ ను కలిసిన శత్రుజ్ఞ సిన్హా

Posted: 11/09/2015 04:21 PM IST
Shatrughan sinha meets nitish kumar

అసలే గాయం.. దానికి మీద కారం చల్లితే ఎలా ఉంటుంది. అచ్చం ఇలానే ఉంది బిజెపి పరిస్థితి. తమ పార్టీ వాళ్లే తమకు గొంతులో వెళక్కాయలాగా మారుతుండటంతో బిజెపి నాయకులు తలలు పట్టుక్కూర్చున్నారు. నితీష్ కుమార్ బీహార్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సంపాదించారు. తిరుగులేని మెజార్టీతో బీహార్ లో అధికారంలోకి రావడానికి నితీష్ కుమార్ సిద్దపడుతున్నారు. కాగా ఎన్డీయేకు నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. నితీష్ ఎన్డీయేకు చుక్కలు చూపించి.. బిజెపి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశారు. అయితే తాజాగా మరో బిజెపి నాయకుడు నితీష్ కుమార్ ను కలవడం వివాదాస్పదమైంది.

నితీష్ కుమార్ ను యాక్టర్, బిజెపి నాయకుడు శత్రుజ్ఞ సిన్హా కలుసుకున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ను పొగుడుతూ.. శత్రుజ్ఞ సిన్హా కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే బిజెపి పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అందుకే అతడిని బీహార్ ప్రచారానికి దూరంగా ఉంచింది. కానీ శత్రుజ్ఞ దీన్ని వ్యతిరేకించారు. తనను కాదని. తన కన్నా జూనియర్లను పార్టీ ప్రచారానికి వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాగా బీహార్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం.. నితీష్ కుమార్ గెలవడం జరిగిపోయాయి. అయితే తాజాగా నితీష్ ను కలిసిన శత్రుజ్ఞ అతడికి అభినందనలు తెలిపారు. అయితే ఒకవేళ తాను నితీష్ ను కలిసినందుకు పార్టీ చర్యలకు దిగితే దాన్ని తాను అడ్డుకోలేనని అన్నారు. అలాగే ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకుల మీద చర్యలు తీసుకోవాలని కూడా అతడు డిమాండ్ చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles