Congress mlc list to be released shortly

MLC elections, Congress MLC list, Sonia Gandhi home, 160 members list, Congress High Command

Congress MLC list to be released shortly.

Congress MLC list to be released shortly.png

Posted: 03/09/2013 09:53 PM IST
Congress mlc list to be released shortly

kiran-sonia

అధికార కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీ టిక్కెక్కట్లను తన వారికి ఇప్పించడం కోసం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రి, పీసీసీ బొత్స ఢిల్లీ వెళ్లి అక్కడ మకాం వేసి కాంగ్రెస్ పెద్దలను కలిసి లాబీయింగ్ లు జరిపిన విషయం తెలిసిందే. వివిధ ముఖ్యనేతలతో సమావేశం అయిన వీరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఎంపికలో కాంగ్రెస్ అధినేత్రి ముద్ర కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ అజాద్ ఈరోజు ఉదయం సమావేశమై అభ్యరులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక బొత్స ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫారాలు రేపు ఇస్తామని చెప్పడం చూస్తుంటే దాదాపు తుది జాబితా తయారైనట్లే కనిపిస్తుంది. ఇప్పటి వరకు సస్పెన్స్ లో ఉన్న ఈ జాబితాలోని పేర్లను ఏ క్షణంలోనైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందు అనుకున్నవారు కాకుండా కొత్త వారు పేర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్ధులలో ముఖ్యంగా  పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధీరావత్ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్, షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shiva temples over crowded being shiva ratri
Mp azharuddin meet kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles