Shiva temples over crowded being shiva ratri

shivaratri, shiva temples, crowded temples, hindu gods

shiva temples over crowded today being shiva ratri

shiva-devotees.png

Posted: 03/10/2013 12:41 PM IST
Shiva temples over crowded being shiva ratri

shiva-idolశివరాత్రి సందర్భంగా హైద్రాబాద్ నగరంలో అన్ని శివాలయాలూ భక్తులతో నిండిపోయి ఉన్నాయి.  రాష్ట్రంలో ముఖ్యమైన ఆలయాలైన, కర్నూల్ జిల్లా లోని శ్రీశైలం, తూర్పు గోదావరి జిల్లా లోని ద్రాక్షారామం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కరీం నగర్ జిల్లా లోని వేములవాడ, విజయవాడ కనకదుర్గ ఆలయాలు భక్తజనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.  గుంటూరు జిల్లా కోటప్పకొండ ఈ రోజు ప్రభలకు ప్రసిద్ధి.  దూర దూర ప్రాంతాల నుంచీ వివిధ అలంకరణలతో కూడిన ప్రభలు కోటప్పకొండకు చేరుకుంటున్నాయి.  

ఈ మధ్యనే జరిగిన బాంబు పేలుళ్ళ దృష్ట్యా, నిఘా సంస్థల హెచ్చరికల దృష్ట్యా పోలీసు పహరాలు, తనిఖీలు ముమ్మరమయ్యాయి.  శ్రీశైలంలో స్వామి దర్శనంకోసం కనీసం 10 గంటలు వేచివుండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కానీ భక్తులు ఓపిగ్గా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోదలచుకున్న శివదర్శనం కోసం క్యూలలో నిలబడి ఉన్నారు.  ఉత్సాహంగా శివనామ స్మరణలతో హోరెత్తిస్తున్నారు.  

రాష్ట్రంలోను, దేశంలో వివిధ ప్రాంతాలలోనూ భక్తలతో పోటెత్తిన శివాలయాల్లో కొన్ని చోట్ల పరిస్థితి అదుపుతప్పుతున్న వార్తలు వినవస్తున్నాయి.  ఎవరికి దక్కే పుణ్యం వారిదే ఎవరికి దొరికే ముక్తి వారిదే కాబట్టి ఆలయాల్లో సామాన్యంగా ఎవరికి వారే ఇతరులకంటే ముందుగానూ త్వరగా దర్శనం చేసుకుందామని, ఇతరుల కంటే ఎక్కువ సేపు స్వామి చెంత గడుపుదామని అనుకోవటమే తొక్కిసలాటలకు దారితీస్తాయి.  వచ్చింది ఆలయానికి, ఉండాల్సింది భక్తి తత్త్వంలో.  అయినా పని త్వరగా ముగించుకుని పోదామనుకోవటం కానీ, ఇతర భక్తుల పట్ల, కట్టుదిట్టాలు చేస్తున్న ఆలయంలోని నియంత్రణ సిబ్బంది పట్ల సహనం లేకపోవటాలు తోపులాటలకు దోహదం చేస్తాయి.  పలు ప్రాంతాలలో ఆలయాలలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డట్టుగా కూడా సమాచారం అందుతోంది.  ఆలయ సందర్శన సమయంలో భక్తి భావం లో ఉండకుండా, దర్శనానికి, ప్రసాదాలకు ఎగబడటమే ఒక్కోసారి అనర్ధాలకు దారితీస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modipng
Congress mlc list to be released shortly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles