ఈరోజు ఉదయం తమిళనాడులో స్టాలిన్ ఇంటితో పాటు మరో 19 ప్రదేశాలలో సిబిఐ దాడులు నిర్వహించింది. దాడులకు కారణం తెలియదని కానీ ఇది కచ్చితంగా రాజకీయ వైరం వలన జరుగుతున్నదని చెప్పగలనని, యుపిఏ మద్దతుని వెనక్కి తీసుకోవటం వలన జరిగిన పనేనని, దీనిమీద కోర్టుకి వెళ్తానని కరుణానిధి రాజకీయ వారసుడిగా అందరూ చెప్పుకుంటున్న స్టాలిన్ అన్నారు.
ఆకస్మిక దాడులకు సిబిఐ చెప్పిన కారణం ఇది-
ఒక లిమోజిన్ తో సహా కొన్ని కార్లను దిగుమతి చేసుకున్న విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూలో ఒక సీనియర్ అధికారి మురుగానందన్ ని మరో ఇద్దరు అధికారుల మీద నిన్న సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, వాళ్ళు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అక్రమ దిగుమతుల లావాదేవీల మీద చర్యలు తీసుకోలేదు. ఆ లావాదేవీలలో తెలియని కొందరు వ్యక్తులతో కలిసి ఆర్ధిక నేరానికి పాల్పడుతూ, ప్రభుత్వానికి 20 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. అందులో ఒక కారుని స్టాలిన్ కుమారుడు వాడుతున్నాడని, మిగిలినవాళ్ళ వివరాలు దర్యాప్తులో తేలుతాయని దర్యాప్తు సంస్థ చెప్తోంది. సిబిఐ వాళ్లకి అందిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి చేస్తున్న దర్యాప్తులో ఇంకా కొంత మంది వ్యాపారస్తుల ఇళ్ళు, ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయని సిబిఐ అధికారులు తెలియజేసారు.
స్టాలిన్ ఇంటి దగ్గర సిబిఐ దాడి విషయం తెలియగానే డిఎమ్ కే నాయకులు పెద్ద సంఖ్యలో స్టాలిన్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు.
ఈ సందర్భంలో స్టాలిన్ మీద సిబిఐ విచారణ దురదృష్టకరమని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదైనా, ఈ సందర్భంలో అది పలు అనుమానాలకి దారితీస్తుందని, అందువలన దానికి సంబంధించిన మంత్రికి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేసానని చిదంబరం అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more