Chandrababu naidu in tdp annual function

telugu desam party, chandrababu naidu, nt ramarao, murali mohan, yanamala ramakrishnudu, ekaveera title

chandrababu naidu in tdp annual function

chandrababu-naidu.png

Posted: 03/29/2013 04:43 PM IST
Chandrababu naidu in tdp annual function

తూర్పు గోదావరి జిల్లా పెదపూడిలో జరిగిన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పార్టీకి 31 సంవత్సరాలు నిండిన సందర్భంగా 31 కిలోల కేక్ ని కట్ చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంలో మాట్లాడిన చంద్రబాబు, వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించాలని అందరినీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అంతకు ముందు వైయస్ఆర్ ప్రభుత్వంలో పుత్రప్రేమతో రాష్ట్రంలో దొంగలు పడి దోచుకున్నారని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా పార్టీలో మొదటి నుంచీ ఆటుపోట్లను ఎదుర్కుంటూ విశ్వాసపాత్రంగా వ్యవహరించిన నాయకులను చంద్రబాబు సత్కరించారు. అందులో, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమెల్లి మూలారెడ్డి, చిక్కాల రామచంద్రరావు, ఎ.వి.సూర్యనారాయణ రాజు, మెట్ల సత్యనారాయణ, వల్లూరి నారాయణరావు, నిమ్మకాయల చిన రాజప్పలు ఉన్నారు. వేడుకల్లో చంద్రబాబుని ఏకవీర బిరుదుతో సత్కరించారు.

ఖమ్మంలో 32 కిలోల కేక్ ని కట్ చేసిన మురళీమోహన్.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 32 సంవత్సరాలైన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు మాగంటి మురళీ మోహన్ 32 కోలోల కేక్ ని కట్ చేసి, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం ద్వారా ప్రజల సమస్యలు గట్టెక్కుతాయని అన్నారు. అంతకు ముందు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lakshmi in critical condition
Si venkatesh wounded in gun fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles