Akhilesh yadav blames congress using cbi as a tool

cbi, congress govt. upa govt, samaj vadi party, mulayam singh, akhilesh yadav

akhilesh yadav blames congress using cbi as a tool

cbi-govt-hand-tool.png

Posted: 03/30/2013 05:35 PM IST
Akhilesh yadav blames congress using cbi as a tool

akhilesh-yadav-photo

కేంద్ర ఆర్థిక మంత్రి శభాష్ అంటూ అఖిలేష్ యాదవ్ భుజం తట్టి ఎంతో సేపు అవలేదు, అంతలోనే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించటం మొదలుపెట్టింది సమాజ్ వాది పార్టీ. సమాజవాది పార్టీ అధ్యక్షుడు ములాయమ్ సింగ్ కుమారుడు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అలహాబాద్ లో ఉత్తర్ ప్రదేశ్ బార్ కౌన్సిల్ భవన ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శను చేసారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న యుపిఏ ప్రభుత్వం మాట వినకపోతే వాళ్ళ వెనక సిబిఐ ని పంపిస్తారంటూ కాంగ్రెస్ ని దుయ్యబట్టారు. దేశంలో అన్ని మూలలా యుపిఏ ప్రభుత్వ వైఖరికి అసంతప్తి జ్వాలలు రేగుతున్నాయని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాని మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని అఖిలేష్ అన్నారు. సమాజ శ్రేయస్సులో మేము యుపిఏ ప్రభుత్వానికి మద్దతునిస్తాం కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తయారుగానే ఉన్నమని కూడా ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ ములాయమ్ సింగ్ యాదవ్, కాంగ్రెస్ భయపెట్టి మద్దతు తీసుకుంటుందన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి నా కష్టకాలంలో మద్దతునిచ్చాను. కానీ నా వెనకాల కూడా సిబిఐ ని పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారాయన.

ఈ మాటతో భాజపా కూడా ఒకప్పుడు సమాజ్ వాది పార్టీని ఎత్తిపొడిచింది. సిబిఐ భయం వలనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారంటూ నిందించింది.

సమాజ్ వాది పార్టీ మీద అతి తీవ్రంగా వ్యాఖ్యానాలు చేసిన కాంగ్రెస్ యూనియన్ మినిస్టర్ బేనీ ప్రసాద్ వర్మ ని తొలగించటానికి కూడా మేము కాంగ్రెస్ మీద వత్తిడి తెస్తామన్నారు అఖిలేష్.

డిఎమ్ కే మద్దతు ఉపసంహరణతో బలహీనమైన యుపిఏ ప్రభుత్వం సమాజ్ వాది పార్టీ కూడా విడిపోతే ఎలా అని తర్జన భర్జన పడేట్టుగా చేస్తోంది ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీని తమ ఇష్టానుసారం వాడుకోవటానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Theft attempt in shamshabad mandal foiled
Possiblie criminal activity acertainable  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles