Theft attempt in shamshabad mandal foiled

hyderabad, shamshabad, theft in innova, locals foil theft attempt

theft attempt in shamshabad mandal foiled by locals

theft-attempt.png

Posted: 03/31/2013 08:57 AM IST
Theft attempt in shamshabad mandal foiled

హైద్రాబాద్ శంషాబాద్ మండలంలోని కేవేలీగూడలో ఏడుగురు దోపిడీ దొంగలు ఇన్నోవా కారులో వచ్చారు. ఒక ఇంటిలో పడి వారు దొంగతనం చెయ్యదలుచుకున్నది ఆ ఇంట్లో ఉన్న గొర్రెలను. సిటీలో పక్క ఫ్లాట్ లో దొంగతనం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఆ ఇంటి వాళ్ళే కాబోలు అనుకుంటారు. ఆ దొంగలు వెళ్ళేటప్పడు చేతుల్లోంచి ఏమైనా వస్తువు జారి పడితే దాన్ని వంగి తీసి వాళ్ళకి అందిస్తారు కూడా. ఎక్కువ బరువుంటే లిఫ్ట్ వరకు సాయం చేసినా చేస్తారు. కానీ గ్రామ పరిధిలో అలాంటి అవకాశం లేదు. ప్రతివాళ్ళకి ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లోని సభ్యులు, వాళ్ళ ఇంటికి వచ్చిపోయే బంధువులు, అతిథులు అందరినీ గుర్తుపడతారు. అలాంటి చోటికి ఇన్నోవా కారు తీసుకుని వస్తే స్థానికుల దృష్టిని ఆకర్షించదూ.

స్థానికులు దొంగలకు అడ్డు పడుతుంటే వాళ్ళని తప్పించుకునే ప్రయత్నంలో దోపిడీ ముఠా కారుని ఒక మనిషి మీదుగా పోనిచ్చే సరికి అతను అక్కడికక్కడే మృతి చెందటంతో ఆగ్రహం వహించిన స్థానికులు ఆ దొంగలలో పారిపోయే ప్రయత్నంలో ఉన్న నలుగురిలో ఒక మనిషినైతే పట్టుకోగలిగారు. అలా పట్టుకున్న మనిషిని ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. పోలీసులు వచ్చే లోపులోనే చితకబాదారు. మిగిలిన ముగ్గురు దొంగలూ పారిపోయారు. ఉద్రిక్తంగా మారిన పరిస్థితి పోలీసుల రాకతో కాస్త చల్లారింది. దర్యాప్తు సాగిస్తున్నారు. ఆ దొంగలు బహుశా హైద్రాబాద్ పాతబస్తీకి చెందినవాళ్ళైవుండవచ్చని అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sekhar kammula i care i react organisation
Akhilesh yadav blames congress using cbi as a tool  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles