Sekhar kammula i care i react organisation

sekhar kammula film director, happy days movie, leader movie, anand movie, life is beautiful movie, i care i react organisation

sekhar kammula i care i react organisation

sekhar-kammula.png

Posted: 03/31/2013 09:04 AM IST
Sekhar kammula i care i react organisation

sekhar-kammula

సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిన్న ఖమ్మం శారదా ఇంజినీరింగ్ కాలేజ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో అసమానతలుండగూడదని, అందరూ హాయిగా ఆనందంగా జీవించాలని, అవినీతి అనేది సమాజంలో పోవాలనే కధాంశాలతో, స్త్రీలకు సరైన గౌరవమిస్తూ తన ఆలోచనా ధోరణికి అనుగుణంగా సినిమాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల తను స్థాపించిన ఐకేర్ ఐరియాక్ట్ సంస్థ గురించి చెప్తూ, దీని ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకునివచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన తనని కదిలించివేసిందని, ఈ సంస్థ ద్వారా ప్రజలను ప్రభావితం చెయ్యటం తన ఉద్దేశ్యమని శేఖర్ కమ్ముల అన్నారు.

శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్, గోదావరి సినిమాల్లో దర్శకుడిగా అందులో ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఉండేవిధంగా చిత్రీకరించారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో జీవించే కథానాయిక కథనాన్ని చక్కగా చిత్రీకరించారు. అలాగే హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలలో సమాజంలోని అసమానతలను చూపిస్తూ, వాటిని అధిగమించి అందరూ హాయిగా ఎలా జీవితాలను సాగించవచ్చో చూపించారు. ఇక లీడర్ సినిమాలో అవినీతిని స్పష్టంగా చూపించారు. రాజకీయాలు అవినీతికే కాదు ధనార్జనకు కూడా దూరంగా nirbhayaఉండాలనే సందేశాన్ని మనసుకి హత్తుకునేట్టుగా చెప్పారు.

శారదా ఇంజినీరింగ్ కళాశాలలో అక్కడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, ఆ తర్వాత ఐ కేర్ ఐ రియాక్ట్ సంస్థ ఉద్దేశ్యాలను విడమరిచి చెప్పారు. ఆటోగ్రాఫ్ ల లాంటి తతంగం అయిపోయిన తర్వాత శేఖర్ కమ్ముల కళాశాల ఆవరణలో మొక్కను నాటి దానికి నీళ్ళు పోసారు. దానికి నిర్భయ అని నేమ్ ప్లేట్ పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New medicine approved by fda for diabetes type 2 patiesnts
Theft attempt in shamshabad mandal foiled  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles