2000 new rtc buses to hit roads in current year

apsrtc, rtc vc md a k khan, 2000 new buses for rtc, rtc losses, rtc losses to arrest

2000 new rtc buses to hit roads in current year

ak-khan.png

Posted: 04/02/2013 03:50 PM IST
2000 new rtc buses to hit roads in current year

ak-khan-photo

ఈ సంవత్సరం ఆర్ టి సి రెండు వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ఈ విషయాన్ని కడపలో తెలియజేసిన ఆర్ టి సి వైస్ ఛైర్మన్, ఎమ్ డి ఎకె ఖాన్ కడప పర్యటనలో ఉన్నారు. ఆర్ టి సి వర్క్ షాప్ ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎ కె ఖాన్, అక్కడి కార్మికులను పరామర్శించారు. బస్ స్టాండ్ ని పరిశీలించి అక్కడి దుకాణదారులతో మాట్లాడారు. ఆర్ టి సి బస్ స్టాండ్ లలో రేట్లు ఎమ్ ఆర్ పి ని దాటి పోగూడదని వాళ్ళకి చెప్పారాయన.

ఇంద్ర ప్రయాణీకుల విశ్రాంతి గదిని, ఆర్ టి సి కార్మికుల క్రీడల మైదానాన్ని ఎ కె ఖాన్ ప్రారంభించారు. ఆ తర్వత ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేసిన వారిని ప్రశంసా పత్రాలు, బహుమతులతో సత్కరించారు. కడప లో విస్తృతంగా పర్యటించిన ఎకె ఖాన్, ఉద్యోగులతో మాట్లాడుతూ, ఆర్ టి సి నష్టాలలో కూరుకునిపోయి ఉందని, ఆ నష్టాలు పూరించకపోయినా లాభాల బాట పట్టకపోయినా, కనీసం ఆర్ టి సి నష్టాలను పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత అందరి మీదా ఉందని గుర్తు చేసారు.

 -శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another chargesheet in jagan case
High court gave two weeks time for digitisation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles