Another chargesheet in jagan case

ys jagan, vijaya sai reddy, cbi probe, pharma companies, ysr congress

CBI files another supplementary chargesheet in YSR Congress Party chief YS Jaganmohan Reddy's DA case on Tuesday

another chargesheet in jagan case.png

Posted: 04/02/2013 09:52 PM IST
Another chargesheet in jagan case

jagan-saireddyవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో నేడు సీబీఐ మొదటి ఛార్జి షీటుకు అనుబంధ ఛార్జీషీటును దాఖలు చేసి కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం నాలుగు అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో మొత్తం 13 మందిని నింధితులుగా పేర్కొంది. తొమ్మిది మంది సాక్షులను చేర్చుతూ.... ఇరవై తొమ్మిది పేజీల ఛార్జిషీటును సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఇందులో ఫార్మా కంపెనీలు అయిన అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ కంపెనీలు 29 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది. ఈ పెట్టుబడులతో ఫార్మా కంపెనీలు ఆర్వోసీని ఉల్లంఘించాని పేర్కొంది. జగన్ ని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9 కింద విచారణ జరపాలని కోరింది. అయితే జగన్ కేసు రాజకీయ కేసుగా మారిందన్న ఆరోపణలు వస్తున్నా, సీబీఐ వాటిని పట్టించుకోకుండా అనుబంధ ఛార్జిషీట్లు వేస్తూ కేసును సాగదీస్తుంది.

మరో వైపు జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి న్యూఢిల్లీలో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడి అధికారులు విజయ సాయి రెడ్డిని దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. వాన్ పిక్ అంశంపై ఈడి విజయ సాయి రెడ్డిని ప్రశ్నించింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Party changed but scene continues
2000 new rtc buses to hit roads in current year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles