Party changed but scene continues

telugu desam party, bharatiya janata party, kishan reddy, electricity charges hike, protests against elec charges

party changed but scene continues

tdp-bjp.png

Posted: 04/03/2013 08:44 AM IST
Party changed but scene continues

kishan-reddy-photoపార్టీలు వేరు.  కానీ సన్నివేశం ఒకటే.  విద్యుత్ కొరతలు, విద్యుత్ ఛార్జీల మీద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేస్తూ ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్ లో నిరాహారదీక్ష చెయ్యటం, పోలీసులు ఓ నాలుగు రోజులు ఉపేక్షించి వారి దీక్షను భగ్నం చెయ్యటం, వాళ్ళని నిమ్స్ హాస్పిటల్ కి తరలించటం. 

చిన్న తేడా ఏమిటంటే దీక్షాభంగం కావించిన సమయం.  తెలుగుదేశం పార్టీ నేతలను అర్ధరాత్రి పడుకుని ఉన్న సమయంలో హడావిడిగా లేపటం జరిగింది.  ఆ సమయంలో వెంటనే ఏం జరుగుతోంది, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి అన్నది తెలియక ముందే చకచకా పని కానిచ్చుకోవచ్చన్న ఊహ కూడా సమర్ధవంతంగా దీక్షాభంగం చెయ్యటానికి మంచి ఉపాయమే.  భారతీయ జనతా పార్టీ విషయంలో మరీ అర్ధరాత్రి వరకూ ఆగకుండా సాయంత్రమే పదండి పదండి అని లేపి తీసుకెళ్ళారు. 

తెదేపా నాయకుల్లాగానే భాజపా నేతలు కూడా చికిత్సకు నిరాకరిస్తూ ప్రస్తుతం దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుని ఉపసంహరించుకుంటేనే కాని ఈ దీక్ష ఆగదని భాజపా నేతలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు.

 

 -శ్రీజ

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Spiritual guru behind bsp leader bhardwaj murder
Another chargesheet in jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles