Srirama navami function at bhadrachalam in full swing

sriramanavami, bhadrachalam, sitarama devasthanam, yagaam, traditional sita rama wedding ritual

srirama navami function at bhadrachalam in full swing

కమనీయమైన కళ్యాణ వేడుకలు

Posted: 04/18/2013 09:09 AM IST
Srirama navami function at bhadrachalam in full swing

భద్రాచలం శ్రీరామచంద్ర మూర్తికి ఈ రోజు ఘనంగా అభిషేకం జరుగుతోంది.  ఇవి పెళ్ళికి ముందు చేసే మంగళ స్నానాలు.  రాత్రికి ఎదురుకోలు ఉత్సవం ఉంటుంది. 

సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగినా కమనీయంగా కళ్ళపండుగగా చేస్తారు.  అంతే కాదు మన ప్రాచీన సాంప్రదాయ పద్ధతిలో జరిగే కళ్యాణ వేడుకలను దేవుళ్ళ చేత చేయిస్తారు.  ఈ రోజు జరిగే ఎదురుకోలు లో రాముడుకి ఎదురు వెళ్ళి తీసుకొస్తారు.  ఈ పెళ్ళి వేడుకల్లో మాత్రమే సీతారాముల ఉత్సవ విగ్రహాలను అలా విడదీయటం జరుగుతుంది.  పెళ్ళికి ముందు వధూవరుల పేర్లు, కుటుంబ విశేషాలను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నట్టుగా పూజారులు రెండు వర్గాలుగా చీలి సంభాషించుకుంటారు.  కళ్యాణాన్ని తిలకించటానికి వచ్చిన భక్తులను పెళ్ళికి వచ్చిన పెద్దలుగా భావిస్తారు. 

మిగతా భక్తి కార్యక్రమాలలో పూజారులు ఏదో చేస్తుంటే భక్తులు వారి ఆలోచనల్లో వాళ్ళుండిపోయి హారతికి గంట కొట్టినప్పుడు ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చినట్టు కాకుండా కళ్యాణ మహోత్సవంలో ప్రతి తంతునీ అందరికీ అర్థమయ్యేట్టుగా విశదీకరిస్తూ కళ్యాణాన్ని పూర్తి చెయ్యటం విశేషం. 

ఈ రోజు ఉదయం సాయంత్రం భద్రాచల సీతారాముల ఆలయంలోని యాగశాలలో ఉత్సవాంగ హవనం చేస్తారు.  పెళ్ళికి తరలి వచ్చిన భక్తులతో నిన్న ఉదయం నుంచే భద్రాచల పుణ్యక్షేత్రం బహు రద్దీగా ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles