Kiran kumar says t leaders narrow mindedness exhibited

bayyaram mines issue, kiran kumar criticizes t leaders, rinl visakha steel, employment to 4000, ancillory unit at bayyaram

kiran kumar says t leaders narrow mindedness exhibited

తెలంగాణా వాదుల సంకుంచితత్వం

Posted: 04/21/2013 03:16 PM IST
Kiran kumar says t leaders narrow mindedness exhibited

తెలంగాణా వాదులు బయ్యారం గనుల విషయంలో సంకుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.  అవే గనులను వ్యక్తులకు కేటాయించినప్పుడేమో మాట్లాడలేదు, ఇప్పుడు ప్రభుత్వ సంస్థకు కేటాయించటానికి అడ్డుపడుతున్నారు.  విశాఖలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యమైన  రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి ఇంతవరకు సొంతంగా గనులు లేవు కాబట్టి వీటిని కేటాయిద్దామన్నది ప్రభుత్వ ప్రతిపాదన.  దీనివలన స్థానికులకు కనీసం 4000 మందికి ఉపాధి కలుగుతుంది అంటూ విశాఖపట్నం సమీపంలో వేపగుంటలో అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించిన కిరణ్ కుమార్ అన్నారు.

ఒకచోట ఉన్న నిధులను మరో ప్రాంతపు అభివృద్ధి కోసం వాడటానికి ఈ పని చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర సమితి, ఇతర పార్టీలు అనటం వాళ్ళ కుంచిత మనస్తత్వాన్ని తెలియజేస్తోందని కిరణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు.  బయ్యారంలో స్థానికంగా అనుబంధ సంస్థను 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించటం కూడా ఒప్పందంలో భాగమే అన్నారాయన.  

కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న సంస్థకు బయ్యారం గనులను కేటాయించటానికి ప్రభుత్వం ఆలోచన చేసింది.  అటువంటి సంస్థ వ్యక్తుల ప్రయోజనం దృష్టిలో పనిచెయ్యదు అని కిరణ్ కుమార్ వివరించారు.  42000 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడితో ఆర్ఐఎన్ఎల్ సంస్థ అదనంగా ఉత్పత్తిని పెంచుతూ 25000 మందికి అదనంగా ఉపాధి కలిగించబోతోందని, ఇందులో తప్పు పట్టాల్సిందేముందని ఆయన ప్రశ్నించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles