Sarabjit singh died in jinna hospital

sarabjit singh died, sarabjit singh in pakistan jail, lahore jinna hospital, afjal guru, kasab, prisoners attack sarabjit singh

sarabjit singh died in jinna hospital

సరబ్ జిత్ సింగ్ మృతి

Posted: 05/02/2013 09:48 AM IST
Sarabjit singh died in jinna hospital

పాకిస్తాన్ జైల్లో తోటి పాకిస్తానీ ఖైదీల చేసిన దాడిలో గాయపడి లాహోర్ జిన్నా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ నిన్న అర్ధరాత్రి మరణించారని వైద్యులు ప్రకటించారు. 

పాకిస్తాన్ జైల్లో 20 సంవత్సరాల నుంచి యుద్ధ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న సరబ్ జిత్ సింగ్ జైల్లోని ఖైదీల దాడికి తీవ్రంగా గాయపడ్డట్టు తెలియగానే అతనికి మెరుగైన వైద్య సేవలనందించటానికి భారత్ కి పంపించమని భారత ప్రభుత్వం కోరినా ఏవేవో సాకులతో తాత్సారం చేసి చివరకు అతన్ని మరణానికి గురిచేసారు పాకిస్తాన్ అధికారులు. 

పాకిస్తాన్ జైల్లో దాడికి కారణం ఉగ్రవాదులు కసబ్, అప్జల్ గురుల ఉరిశిక్ష అని సమాచారం.  దాడికి ఉసిగొలిపారో లేదో తెలియదు కానీ, జైలు అధికారులు తలచుకుంటే మాత్రం దాడిని ఆపగలిగేవారే.  ఇవన్నీ బయటపడగూడదనే భారత్ జోక్యం ఎక్కువగా లేని విధంగా హాస్పిటల్ కి తరలించి, మెరుగైన వైద్యం కోసం పంపించటంలో జాప్యం చేసి చివరకు సరబ్ జిత్ సింగ్ మరణానికి కారణమయ్యారు. 

సరబ్ జీత్ మరణానికి ప్రధాన మంత్రి సంతాపాన్ని వెలిబుచ్చారు.  హోంమంత్రి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.  దేశాల మద్య కక్ష వలన అసువులు బాసిన సరబ్ జిత్ ను త్యాగజీవిగా పరిగణించాలంటూ అతని కుటుంబ సభ్యులు కోరారు. 

భారత్ కి ఆ స్థితిలో పంపించినా సరబ్ జిత్ బ్రతికి ఉండవచ్చని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.  వారి ఆత్మకు శాంతికలగాలని ప్రార్థించమేతప్ప చనిపోయినవారిని తిరిగి తీసుకునిరాలేము.  అలాగే, కసబ్, అప్జల్ గురుల ప్రేతాత్మలు ఇంకా ఎంత కాలం పట్టి వేధిస్తాయో తెలియదు కానీ ఇంతటితోనైనా వారి ఆత్మలు శాంతించి పైలోకాలకు పోయి, రెండు దేశాల మధ్య అగాధాన్ని ఇంకా పెంచకుండా ఉంటే చాలు అని కోరుకుందాం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles