Rift between babu and harikrishna media creation

chandrababu harikrishna not in dispute, actor kalyanram, actor junior ntr, actor taraka ratna, telugu desam party, chandra babu naidu

rift between babu and harikrishna media creation

మేమంతా బాగానే ఉన్నాం. మీరే

Posted: 05/02/2013 10:50 AM IST
Rift between babu and harikrishna media creation

హరికృష్ణకూ చంద్రబాబుకీ మధ్య ఎటువంటి గొడవలూ లేవని, ఎంతో సామరస్యంగా ఉన్నారని, చిన్నదాన్ని పెద్దగా చేసి రాద్ధాంతం చేస్తున్నది మీడియాయేనని కళ్యాణ్ రామ్ అన్నారు. 

ఈరోజు ఉదయం తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం అనంతరం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలుగు దేశం అధినేత చంద్రబాబుకీ తన తండ్రి హరికృష్ణకూ మధ్య విభేదాలు కేవలం మీడియా సృష్టి మాత్రమేనని చెప్పిన తర్వాత తన గురించి కూడా చెప్తూ, తాను అందరి మంచికోరే వ్యక్తినని, చంద్రబాబు తో ఉండి ఆయనకు తోడుగా పార్టీకి మద్దతుగా తన సహాయ సహకారాలను అందిస్తానని కళ్యాణ్ రామ్ అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎటువంటి వ్యాఖ్యానాలూ చెయ్యకపోయినా, పార్టీకి మద్దతునిస్తానని మాత్రం లోగడ ఫ్లెక్సీ గొడవల మధ్య అన్నారు.  అయితే ఆయన చంద్రబాబు గురించి ఏమీ అనలేదు కానీ, తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పట్ల తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు.  విశాఖలో చంద్రబాబు పాదయాత్ర ముగింపు ఉత్సవాలకు ముందు తారక్ కూడా చంద్రబాబు కి మద్దతుగా పాదయాత్రలో కదం కలిపారు. 

మేమంతా బాగానే ఉన్నాం, గిచ్చుకున్నా అది ప్రేమతో సరదాగా ఆటలో జరుగుతున్నదే కానీ గిచ్చుడు గుర్తులను చూసి మీరు మాత్రం మామధ్య కీచులాటలున్నాయని అనుకోకండి, చిన్న చిన్న గిచ్చుళ్ళను భూతద్దంలో చూసి పెద్ద గాయాలని, అవికూడా కీచులాటల ఫలితాలని మాత్రం అనుకోకండి, అటువంటి ప్రచారాలు చెయ్యకండి అన్నశైలిలో కళ్యాణ్ రామ్ మీడియాకు తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles