Jagan ysr anam vivekananda reddy comments on jagan bail

anam vivekananda reddy, anam vivekananda reddy comments on jagan bail, central minister kotla suryaprakash reddy, jagans bail rejection, congress party, ysrcp, ys jagan, jagan-ysr, tadaka review, sukumarudu review,

anam vivekananda reddy comments on jagan bail

బెయిల్ ఎలా వస్తుంది?

Posted: 05/10/2013 10:09 AM IST
Jagan ysr anam vivekananda reddy comments on jagan bail

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్‌ఆర్ కరప్షన్ పార్టీగా పేరు మార్చాని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సలహా ఇచ్చారు. వైఎస్‌ఆర్ పదవిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయలను దోచుకున్న జగన్‌కు బెయిల్ ఎలా వస్తుందని ఆయనఅన్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు రాష్ట్రానికి కేటాయించే బడ్జెట్‌ను జగన్ దోచుకున్నారని ఆరోపిం చారు. వైఎస్‌ఆర్‌సిపి దోపిడీ పార్టీగా మారిందని విమర్శించారు. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నా.. వైఎస్‌ఆర్‌సిపికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. డబ్బుతో రాజకీయాన్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న జగన్ ఆటలు ఇక సాగబోవని ఆనం హెచ్చ రించారు. వైఎస్‌ఆర్‌సిపి పేరును వైఎస్ కరప్షన్ పార్టీగా మార్చు కుంటే సరైన విధంగా ఉంటుందని ఎద్దేవా చేశారు.

ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డికి అసలు బెయిలు అంటూ రాబోదన్నారు. దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన చెందడం ఇందుకు నిదర్శనమని అన్నారు. వైట్‌కాలర్ నేరాలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తూ జగన్మోహన్‌రెడ్డికి అసలు బెయిలంటూ రాబోదని వివేకానంద రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అయిందంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మ అయితే కేంద్ర మంత్రి బన్సాల్ మేనల్లుడ్ని సిబిఐ ఎందుకు అరెస్టు చేస్తుందని ప్రశ్నిం చారు. డబ్బు మదంతో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటని అన్నారు. ఇప్పటికైనా వైఎస్‌ఆర్ సిపి నేతలు పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పాల్పడిన అవినీతి అక్రమాలను బేషరతుగా అంగీకరించాలని, అప్పుడే ఆయన్ను ప్రజలు విశ్వసిస్తారని వివేకానందరెడ్డి అన్నారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles