Political minister chiranjeevi flex photo controversy sorry minister danam

minister chiranjeevi, flex war, minister chiranjeevi fans, congress meeting, minister danam nagendra reddy, chiranjeevi flex controversy

minister chiranjeevi flex photo controversy? sorry minister danam

మంత్రి చిరంజీవిని తాకిన ప్లెక్సీ వివాదం..

Posted: 05/22/2013 01:13 PM IST
Political minister chiranjeevi flex photo controversy sorry minister danam

కేంద్ర మంత్రి,మెగాస్టార్ చిరంజీవి బొమ్మను కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేయకపోవడంపై ఆయన వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత గా ఉండి, సమన్వయ కమిటీ సభ్యుడుగా ఉన్న చిరంజీవి ఫోటో ప్లెక్సీలలో కనిపించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి గౌతం ఆవేదన చెందారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమంలో చిరంజీవి బొమ్మ లేకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుంది.

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతోంది. ఇందులో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఫోటో లేదు. దీంతో చిరంజీవి వర్గం నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ముఖ్య నేత అయిన చిరంజీవి ఫోటోను పెట్టక పోవడమేమిటని వారు ప్రశ్నించారు. వారికి కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ సర్ది చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చారు. దీంతో చిరు వర్గం చల్లబడింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles