God save me scribbled sreesanth in his personal diary

spot fixing sreesanth, god save me, sreesanth, sreesanth in his personal diary, ipl spot-fixing, sofitel hotel, blackberry mobile phone, indian premier league, police officer said investigators, oh god! please save me,

god save me scribbled sreesanth in his personal diary

దేవా! నన్ను కాపాడు..

Posted: 05/22/2013 01:03 PM IST
God save me scribbled sreesanth in his personal diary

‘‘ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడవాళ్లని నమ్మరాదని ’’ మన పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు శ్రీశాంత్ విషయం లో ఇదే జరిగిందా? గతంలో హర్బిజన్ సింగ్ చెంప దెబ్బ కొట్టాడాని.. చిన్న పిల్లవాడి మాదిరి ఏడ్చిన శ్రీశాంత్. ఇప్పుడు భారదేశానికి పెద్ద చెంప దెబ్బ కొట్టి అమాయకంగా జైల్లోకూర్చున్నాడు. తానేతప్పూ చేయలేదని ముందుగా వాదించిన శ్రీశాంత్‌.. పోలీసులు చూపిన ఆధారాలతో మెత్తబడ్డాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో రోజు రోజుకు అరెస్టుల సంఖ్య పెరుగు తుండటంతో తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందనుకున్నాడో ఏమో.. 'దేవా! దయచేసి నన్ను కాపాడు' అని తన డైరీలో రెండుసార్లు రాసుకున్నాడట.

శ్రీశాంత్‌కు దేవుడంటే భయ భక్తులున్న సంగతి తెలిసిందే. పోలీసులకు లభించిన ఆ డైరీలో అనేక మంది మహిళలకు చెందిన ఫోన్‌ నంబర్లు కూడా ఉన్నాయి. అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడకముందు రాశాడా లేక పోలీసులకు చిక్కిన తర్వాత రాశాడా అనేది తేలాల్సి ఉంది. 'శ్రీశాంత్‌ తన డైరీలో ఇలా ఎందుకు రాశాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫిక్సింగ్‌పై అతడిని ఎవరైనా బలవంతపెట్టారా? లేక స్పాట్‌ ఫిక్సింగ్‌లో దొరికిన తర్వాత పోలీసులు తనపై ఉచ్చుబిగిస్తున్నారని భావించి పశ్చాత్తాపంతో రాశాడా అనేది తెలుసుకోవాల్సి ఉంది అని పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles