తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో నిర్వహించిన శిక్షణ శిబిరం కాస్త రసాభసగా మారింది. వేదిక సాక్షిగా ఇరువర్గాల వారు బాహీ బాహీకి దిగారు. కామారెడ్డికి చెందిన గంప గోవర్థన్ వర్గీయులు ఓ వైపు సమావేశం జరుగుతుండగానే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ వర్గీయులు,పార్టీ నాయకులు ఎం.జి. వేణుగోపాల్గౌడ్, తిర్మల్రెడ్డిల అనుచరులు నానా హంగామా చేశారు. పార్టీ పదవులను పాతవారికి కాకుండా ఎమ్మెల్యే తన అనుచరులకే ఇస్తున్నారని వేణుగోపాల్ గౌడ్ ఆరోపించారు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి న్యాయం జరగడం లేదన్నారు. 12ఏళ్లుగా పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా తమను ఎందుకు దూరంగా ఉంచుతున్నారని అన్నారు. దీంతో అక్కడ మాటా మాట పెరిగి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎదుటే ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఓ అరగంట పాటు శిక్షణ శిబిరంలో గందరగోళం నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, ఇరువర్గాల వారిని చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించి వేయడంతో.. గొడవ కాస్త సద్దుమణిగింది. ఇరు వర్గాల సమస్యను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా స్వామిగౌడ్ వారికి హామీనిచ్చారు. శిక్షణ శిభిరం కొట్లాట శిభిరంగా మారడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవమానానికి గురయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more