Jagan ysr court rejects cbis plea to shift vijay sai reddy

ys jagan, vijay sai reddy, cbi special court, ys jagan assets case, auditor vijay sai reddy, ysrcp president y.s. jagan mohan reddy, chanchalguda, chanchalguda central prison, cbi had filed a memo, breaking news, ap politics, political news, andhra news

Court rejects CBIs plea to shift Vijay Sai Reddy

మరో జైలుకు విజయ సాయిరెడ్డిని మార్చలేం : కోర్టు

Posted: 06/25/2013 10:47 AM IST
Jagan ysr court rejects cbis plea to shift vijay sai reddy

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డిని మరో జైలుకు మార్చాలని ఆదేశించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ఇలా కోరడం జైలు నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. సాయిరెడ్డిని చంచల్‌గూడ నుంచి మరో జైలుకు మార్చాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు కొట్టివేశారు. జైలు నిబంధనల్లోని 3 ప్రకారం ఫలానా జైలుకే రిమాండ్‌కు తరలించాలని కోరే అధికారం నిందితునికి లేదని, న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలు అధికారులు నిందితులను రిమాండ్‌లోకి తీసుకుంటారని న్యాయమూర్తి పేర్కొన్నారు. రిమాండ్‌లో ఉన్నవారిని ఏ జైలులో ఉంచాలన్నది జైలు అధికారులు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

సాయిరెడ్డి దాదాపు ఏడాదిపాటు బెయిల్‌పై ఉన్నారని, ఆ సమయంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లి జగన్‌ను కలిశారని.. అప్పుడు సాయిరెడ్డి దర్యాప్తును అడ్డుకున్నారని సీబీఐ ఎప్పుడూ కోర్టు దృష్టికి తేలేదన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకే జైలులో ఉన్నంత మాత్రాన సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న సీబీఐ ఆందోళనకు అర్థం లేదని స్పష్టంచేశారు. జైలులో జగన్‌ను రూం నంబర్ 8లో, సాయిరెడ్డిని 3వ నంబర్ గదిలో ఉంచుతున్నామని, అందువల్ల వీరిద్దరూ కలుసుకునే అవకాశం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనేక మంది వ్యక్తులు జైలులో వీరిని కలుస్తుంటారని, వీరి ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles