Godavari river touching danger level

Godavari high level, Heavy rains in AP, Visakhapatnam weather report, Chhattisgarh, Odisha

godavari river touching danger level

గోదావరి వరద ఉధృతం

Posted: 07/13/2013 12:06 PM IST
Godavari river touching danger level

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులనుంచి పడుతున్న వర్షాలు సామాన్య జనజీవనాన్ని కుంటుపడేట్టుగా చేసింది.  గోదావరి లో నీటిమట్టం భద్రాచలంలో ప్రమాదస్థాయిని మించి పారుతోంది.  భద్రాచలం డివిజన్ లో వాగులు పొంగటం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.  ధవళేశ్వరం దగ్గర నీటి మట్టం కూడా ఉధృతమవుతోంది. 

అయితే ఇంతటితో ఆగటం లేదు.  వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో ఇంకా వర్షాలు పడే సూచనను విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం చత్తీస్ ఘడ్ వైపు వెళ్తుంటే, ఒడిశా నుంచి తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి క్రమంగా కదులుతూ వస్తోంది.  వీటికి తోడుగా నైరుతి ఋతుపవనాలు కూడా కదులుతున్నాయి.   వీటి వలన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అంచనా.

తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచటం వలనమత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ సూచన తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles