Forensic reports on dilsukhnagar blasts

dilsukhnagar blasts, forensic reports Indian muzahideen, 17 dead in dilsukhnagar blasts, Yasin bhaktal, forensic reports

forensic reports on dilsukhnagar blasts

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళ మీద ఫోరెన్సిక్ రిపోర్ట్

Posted: 07/13/2013 02:15 PM IST
Forensic reports on dilsukhnagar blasts

దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ కేసులో అందుక బాధ్యుడు యాసిన్ భట్కల్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. 

పేలుళ్ళు తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ పన్నిన కుట్రేనని తేల్చిన ఫోరెన్సిక్ విభాగం ఆ విషయాన్ని దర్యప్తు సంస్థకు వెల్లడిచేసింది.  సిసి టివిల ఫుటేజ్ ని పరిశీలించిన ఫోరెన్సిక్ విభాగం, భట్కల్ ఘటనాస్థలికి పేలుళ్ళకి కొద్ది సమయానికి ముందు సైకిల్ మీద వచ్చినట్టు, ఆ సైకిల్ కి వెనక భాగంలో భారీగా ఉన్న సంచి వేలాడదీసి ఉన్నట్లు గమనించిన ఫోరెన్సిక్ నిపుణులు, మరో వ్యక్తిని కూడా గుర్తించారు.  అతను తెహసీన్ అక్తర్ అని రూఢిగా చెప్పలేకపోయినా అనుమానాన్ని మాత్రం వ్యక్తం చేసారు. 

ప్రాథమిక పరిశీలనలో కూడా బాంబు దాడిలో సైకిల్ ఉపయోగించినట్లు అంచనా వెయ్యటం జరిగింది.  దాన్ని ఇప్పుడు ధృవీకరించటం జరిగింది.   సైకిళ్ళకూ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు పరచాలనే ప్రతిపాదన కూడా ఆ సమయంలో వచ్చింది. 

ఫిబ్రవరి 21 సాయంత్రం 7 గంటల ప్రాంతలో దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గర జరిగిన పేలుళ్ళలో 17 మంది చనిపోయారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles