Miniature pressure cooker made by nellore artist

Miniature pressure cooker, Nellore miniature artist, Artist Uma Shankar, Eega movie, Heroine Samantha, Limca Book of Records

Miniature pressure cooker made by Nellore artist

బుల్లి ప్రెషర్ కుక్కర్-మినియేచర్ ఆర్ట్

Posted: 07/20/2013 02:44 PM IST
Miniature pressure cooker made by nellore artist

నెల్లూరులో అల్యూమినమ్ తో చేసిన మిని ప్రెషర్ కుక్కర్ అందరినీ అబ్బురపరచింది.  కేవలం మూడున్నర సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఈ మినియేచర్ ప్రెషర్ కుక్కర్ ని నిజమైన ప్రెషర్ కుక్కర్ లాగానే మూత, హ్యాండిల్, వెయిట్ (విజిల్) తో ఒక వేలు మీద నిలబెట్టే విధంగా మలచిన మినియేచర్ ఆర్టిస్ట్ గంధవల్ల ఉమాశంకర్.

మూలాపేట వాసి ఉమాశంకర్ నెల్లూరు జిల్లాలో తెలుగు పండిట్ గా పనిచేస్తున్నారు.  ఆయనకి మినియేచర్ ఆర్ట్ లో ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ఎన్నో సంవత్సరాలుగా అందులో కృషిచేస్తున్నారు.  అంతకు ముందు పెద్దగా వెలుగులో లేని మినియేచర్ ఆర్ట్ రాజమౌళి నిర్మించిన ఈగ సినిమా ద్వార ప్రచారంలోకి వచ్చింది.  అందులో హీరోయిన్ సమంత మినియేచర్ ఆర్ట్ లో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తుంది.  చివరకు అది చనిపోయి ఈగ జన్మ తీసుకున్న ఆమె ప్రియుడుకి రక్షణ కవచాన్ని శూలాన్ని తయారు చెయ్యటానికి పనికి వస్తుంది.

నెల్లూరు లో తయారు చేసిన మినియేచర్ ప్రెషర్ కుక్కర్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.  ప్రస్తుతం తయారుగా ఉన్న ఈ బుల్లి ప్రెషర్ కుక్కర్ ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపిస్తానని ఉమాశంకర్ అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles