Minister sailajanath press meet on new delhi

minister sailajanath, samaikhyandra minister sailajanath, telangana issue, minister sailajanath press meet on new delhi, sailajanath lobbying in new delhi, rimary education minister sailajanath, minister sailajanath in money landering scam, breaking news, ap politics, political news, andhra news

minister sailajanath press meet on new delhi

చివరిదాకా పోరాటం..

Posted: 07/26/2013 02:59 PM IST
Minister sailajanath press meet on new delhi

ఢిల్లీ ఎపి భవన్లో మంత్రుల భేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ తదితరులు మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము చివరి వరకు పోరాటం చేస్తామని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, టిడిపి వైఖరి దుర్మార్గమని సీమాంధ్ర మంత్రులు చెప్పారు. కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, పురంధేశ్వరి తదితరులు సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలోని అన్ని అవకాశాలను సమైక్యం కోసం ఉపయోగించుకుంటామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల చిత్తశుద్దిపై తాము మాట్లాడమని అయితే, వారు మొదట తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు సమైక్యానికి కట్టుబడి ఉన్నారన్నారు. ఊహాగాన వార్తలను తాము పట్టించుకోమన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles