Upa declared separate telangana state

separate Telangana state, UPA coordination committee meet, Sushil Kumar Shinde,Sonia Gandhi,Manmohan Singh,Ghulam Nabi Azad,Digvijay Singh

The UPA coordination committee has unanimously endorsed a separate Telangana state. An announcement is expected this evening.

యూపీయే తెలంగాణ ఇచ్చేసింది

Posted: 07/30/2013 07:13 PM IST
Upa declared separate telangana state

గత 60 సంవత్సరాలుగా  నానుతున్న తెలంగాణ  అంశం పై కాంగ్రెస్ కమిటీ ఏ నిర్ణయానికి వచ్చేసింది. నేడు జరిగిన  యుపిఎ సమన్వయ కమిటీ,  సోనియా నివాసంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంలగాణ అంశం పై ఏకగ్రీవ తీర్మానం చేశారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి కొద్ది సేపట్లో జరిగే మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించనున్నారు. . దీంతో 29వ రాష్ట్రం అవతరించబోతుంది. . దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణపై కాంగ్రెస్ విదానం దాదాపుగా పూర్తి అయింది. త్వరలో వెల్లడించబోయే అధికారిక ప్రకటనలో  హైదరాబాద్  రాజధానిగా తెలంగాణ ఏర్పాటును ప్రకటించవచ్చని,  అదే సమయంలో హైదరాబాద్ సీమాంద్ర కు రాజధానిగా  పదేళ్ళ పాటు ఉంటుందని మీడియా సమావేశంలో అజయ్ మాకెన్ తెలిపారు. దీంతో తెలంగాణ ఆవిర్భావం తధ్యం అయిపోయింది. కాంగ్రెస్ సమన్వయ భేటీలో, సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయయంతో ఓయూలో సంబరాలు మిన్నంటుతున్నాయి. . అలాగే తెలంగాణ వాదులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. మరోప్రక్క సీమాంధ్రలో ఆందోళనలు  చేయడానికి సిద్ధం అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles