Kcr finds faults in kiran kumar comments

TRS Chief KCR, Chief Minister Kiran Kumar, Kiran Kumar Reddy, Kiran speaks about State bifurcation, Kiran Comments condemned by KCR, Telangana power need, Hyderabad Telangana Bhawan

Kcr finds faults in Kiran Kumar comments

ముఖ్యమంత్రి మాటలు భూటకపు మూటలు

Posted: 08/09/2013 05:12 PM IST
Kcr finds faults in kiran kumar comments

హైద్రాబాద్ తెలంగాణా భవన్ లో తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఈ రోజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టారు.  రాష్ట్ర విభజన, హైద్రాబాద్ విషయాల్లో ఆయన చెప్పినవన్నీ భూటకపు మాటలని ఆయన కొట్టిపారేస్తూ, అందులోని తప్పుల పట్టీ తయారు చేసి చెప్పారు.
1.    హైద్రాబాద్ లో ఉన్న న్యాయవాదుల సంఖ్య కేవలం 15000 మాత్రమే.  ఈ విషయంలో కెసిఆర్ కిరణ్ కుమార్ తో బహిరంగ చర్చకు కూడా సిద్ధమే.
2.    గుంటూరు హైకోర్టు 1954లో ఏర్పడితే తెలంగాణాలో 1919లోనే ఏర్పాటైందని కెసిఆర్ చెప్పారు.
3.    పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని మానవతా దృక్పథంతో అంగీకరిస్తున్నామని, కొత్త రాజధాని ఏర్పాటయేంత వరకూ హైద్రాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రం రాష్ట్ర వ్యవహారాలను సాగించుకోవటానికి తనకేమీ అభ్యంతరాలు లేవన్నారాయన.
4.    తెలంగాణాలో పుట్టి పెరిగినవాళ్ళని తెలంగాణా వాళ్ళు కాదని ఎప్పుడు అనలేదు. తెలంగాణా లో పుట్టి పెరిగానన్న ముఖ్యమంత్రి హైద్రాబాద్ లో టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా పరవాలేదన్నారు కెసిఆర్.
5.    ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ మాట్లాడలేదు.  ఆయన ఆ స్థాయినుంచి దిగజారి మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి ప్రజలను పెడదోవ పట్టిస్తున్నారు.
6.    విద్యుత్ విషయంలో తెలంగాణా రైతులు భయపడాల్సిన అవసరమేమీ లేదని, 3082 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉన్న తెలంగాణా ప్రాంతం కేవలం 2485 మెగావాట్ల లోటుతో మాత్రమే ఉందని, జూరాల, జైపూర్ సింగరేణి లనుంచి వచ్చే విద్యుత్ తో తెలంగాణా ప్రాంతం విద్యుత్ లోటు భర్తీ చేసుకుంటుందని భరోసా ఇచ్చారు కెసిఆర్.
7.    అసత్యాలను చెప్పి ప్రజలను, నాయకులను తప్పుదోవ పట్టించే పని ముఖ్యమంత్రి మానుకుంటే మంచిదని కెసిఆర్ కిరణ్ కుమార్ కి హితవుపలికారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles