Gold rates going up with jet speed

gold rates going up, gold imports, gold import duty, Gold merchants, gold ornaments customary, traditional gold purchases

gold rates going up with jet speed

బంగారానికి జెట్ ఇంజన్

Posted: 08/13/2013 04:24 PM IST
Gold rates going up with jet speed

బంగారం ధరకు రెక్కలు రావటం కాదు జెట్ ఇంజనే జోడించటం జరుగుతోంది.  దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 8 నుంచి 10 శాతానికి పెంచటంతో ఇప్పటికే రెక్కలు వచ్చి సామాన్యుడికి అందుబాటులో లేని బంగారం వెల ఇంకా ఆకాశాన్నంటటానికి జెట్ ఇంజనే జోడించినట్లుగా తయారవబోతోంది.  అమిత వేగంతో కానరాని ప్రదేశాలకు చేరుకుని వెనక పొగ దారి మాత్రమే మిగిల్చే జెట్ ప్లేన్ లాగా బంగారం కూడా అమిత వేగంతో సామాన్యుడి కలలలోంచి కూడా బయటకు పోయి ఒకప్పుడు బంగారం ఇలా ఉండేది అన్న జ్ఞాపకాలు మాత్రమే మిగిల్చేలా ఉంది. 

ప్రస్తుతమున్న బంగారు ధరకి ప్రతి పది గ్రాములకు రూ.1000 చొప్పున పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్తకులు చెప్తున్నారు.  అయితే శ్రావణ మాసంలో మొదలయ్యే పండుగలు, వివాహాది శుభకార్యాలకు ఈ పెరిగిన రేటుకే కొనుగోలు చెయ్యవలసిన అవసరం ఏర్పడేట్టుగా ఉంది. 

బంగారమే కాక వెండి, ప్లాటినం మీద కూడా భారత ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది.  అయినా సరే, మనవాళ్ళ ఆచారాలలో బంగారం పెట్టటమనేది ఉంది కాబట్టి ఎంత రేటు పెరిగినా కొనుగోళ్ళు మాత్రం తగ్గక పోవటం వలన బంగారం వ్యాపారులకు రోజురోజుకీ వ్యాపారం పుంజుకుంటూనేవుంది కానీ వ్యాపారం గురించిన భయాలేమీ లేవు.

బంగారంలా అనే మాటకు ఇప్పుడు మరింత విలువ పెరగనుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles