Police hunt for warden who took girl to asaram

Asaram Bapu, Sant Sri Asaramji Bapu, Sexual assault, Rajasthan,

Police claim that Chindwara hostel warden Shilpi allegedly fed the victim stories about ghosts and spirits to lure her away..

దొరికిన ఏ అమ్మాయిని వదల్లేదు

Posted: 09/06/2013 09:54 AM IST
Police hunt for warden who took girl to asaram

పదహారేళ్ళ మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు ఒడిగట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత నెల 15వ తేదీన అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న ఆశారాం బాపు రాసలీలల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పొటెన్సీ టెస్ట్ లో 72 ఏళ్ళ వయస్సులో కూడా ఆశారాం కి ‘ఆ ’ శక్తి యువకుల మాదిరి ఉందనే భయంకర నిజాలను తెలుసుకున్న డాక్టర్లు విస్తుపోయిన విషయం తెలిసిందే. ఇక పోలీసు విచారణలో ఆశారాం అనుచరుడు శివ ఇంకా విస్తుపోయే నిజాలను బయటపెట్టడంతో పోలీసులు అమ్మా ముసలోడా అని ముక్కున వేలేసుకున్నారు. మధ్యప్రదేశ్ చింద్వారా గురుకుల్ హాస్టల్ వార్డెన్ శిల్పితో ఆశారాం రోజు రాసలీలలు సాగించేవాడని, రాత్రి ఎనిమిది దాటిన తరువాత మహిళలను తన ధ్యానమందిరంలో కలుసుకునే వారని, శిల్పితో రాసలీలలు సాగించినందుకు ఆమెకు  అహ్మదాబాద్ లో ఒక ఫ్లాట్, ఢిల్లీలో మరో ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడని, అందుకు బదులుగా ఆమె కొందరు మైనర్ బాలికలని, యువతులని ఆశారాం వద్దకు పంపుతుండేదని శివ పోలీసులకు వివరించాడు.ఆశారాం ఆశ్రమం ఆయుర్వేదిక్ విభాగంలో పనిచేసే అమృత్ ప్రజాపతి సైతం ఆశారాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యా ప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఆశారాం మూడు ఆశ్రమాలను నెలకొల్పారని, అక్కడ ఉండే మహిళలతో శారీరకసంబంధం కొనసాగించేవాడని ఆరోపించారు. తాను స్వయంగా ఆశారాం 25 ఏళ్ల యువతితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినట్లు తెలిపారు. లైంగిక వేధింపుల నేరం కింద పోలీసులు తనపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆశారాం బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించాడు. అయితే కోర్టు అతని బెయిల్ పిటిషన్‌ని కొట్టివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles