Cm n kiran meets on hm shinde

CM N Kiran Meets on HM Shinde, Chief Minister N Kiran Kumar Reddy, Home Minister Sushil Kumar Shinde, Telangana issue, samaikyandhra movement, seemandhra movement, Congress, Telangana, Jana Reddy, Shinde

CM N Kiran Meets on HM Shinde

గుణపాఠం చెప్పేందుకు మేం సిద్దం- మేడమ్ కు చెప్పండి: షిండే

Posted: 09/25/2013 11:18 AM IST
Cm n kiran meets on hm shinde

ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పెద్దలతో భేటి అయిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విభజనపై కొంత హితబోద చేసినట్లు సమాచారం. సీమాంద్రలో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమ తీవ్రతను .. ఢిల్లీ పెద్దలకు వివరించినప్పటికి, వారు మౌనంగా సమాదానం చెప్పారు. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులను రాజీనామాలు చెయ్యకుండా కట్టడి చేసిన ముఖ్యమంత్రికి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల నుండి చేదు అనుభావాలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో విభజనపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రోజుకో ప్రకటన చేస్తూండడంతో సీమాంధ్ర ప్రజలు తట్టుకోలేక పోతున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీకి వచ్చిన కిరణ్‌ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సమావేశమయ్యారు. విభజనపై సీడబ్ల్యుసీ తీర్మానం చేశాక రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని, దీంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజన ప్రకటన చేశారన్న అభిప్రాయం వారిలో ఉందని. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు వారంతా సిద్ధమైనట్టుగా కనిపిస్తోందని షిండేకు చెప్పినట్టు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియా, ఇతర అగ్రనేతలకు నచ్చజెప్పి విభజన నిర్ణయం వెనక్కు తీసుకునేవిధంగా చూడాలని సిఎం కోరారు. ఈ విషయంలో తానెలాంటి హామీ ఇవ్వలేనని, ఏమైనా చెప్పాలను కుంటే ప్రధాని మన్మోహన్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాలను కలిసి ఈ విషయాలు చెబితే బాగుంటుందని హితవు పలికారు. సీమాంధ్రలో ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయని చెబుతున్న మీరు, ఈ విషయాన్ని సోనియాను కలిసి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles