Digvijay singh fire on cm kiran

digvijay singh fire on cm kiran, digvijay singh, cm kiran kumar reddy, seemandhra movement, samaikyandra movement,

digvijay singh fire on cm kiran

సిఎం ఏడు రోజులు టైం పెట్టిన దిగ్గిజయ్ సింగ్

Posted: 10/07/2013 10:02 AM IST
Digvijay singh fire on cm kiran

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడటం అందులో భాగమేనని తెలుస్తోంది. విభజన ప్రక్రియలో క్రియాశీల భాగస్వామ్యం తీసుకోకుండా ఒక ప్రాంతానికి మద్ద తుగా నిలుస్తున్న ఆయన వైఖరిని ఇంకెంత మాత్రం సహించేది లేదని ఒక నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో నెలకొన్న తాజా పరిస్థితులను దిగ్వి జయ్‌ ఆయన్ని అడిగి తెలుసుకోవడంతో బాటు అక్కడ శాంతిని నెలకొల్పే దిశగా సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు చెబుతున్నారు.

 

ముఖ్యమంత్రికి ఇదే ఆఖరు పరీక్ష అని, ఆయన రాజకీయ వ్యూహరచనా చాతుర్యానికి, పాలనాదక్షత కు కూడా పరీక్షేనని ఇక్కడి రాజకీయ వర్గాలు భావి స్తున్నాయి. సీమాంధ్రకు అనుకూలంగా మొగ్గుతూ కిరణ్‌ వ్యవహరిస్తున్న వైఖరికి తక్షణమే అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి మరింత విషమించి, విభజన ప్రక్రియకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అధిష్టానానికి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల నుంచి, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల నుంచి నివేదికలు, ఫిర్యాదులు తామరతంపరగా వెళ్లాయి. వాటన్నింటినీ పరిశీలించడంతో బాటు మూడురోజు లుగా సీమాంధ్రలో విషమిస్తున్న పరిస్థితిని కూడా అధిష్టానం గమనంలోకి తీసుకున్నట్లు చెబుతున్నా రు. ఈ దశలో అధిష్టానం గాని కేంద్ర ప్రభుత్వం గాని తన దృఢచిత్తాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని, తద్వారా చిత్తశుద్ధిని చాటడం ద్వారా ముఖ్యమంత్రి వ్యవహారశైలికి కళ్లెం వేయవచ్చునని అధిష్టానంలోని కోటరీ సభ్యులు పార్టీ అధినేత్రికి సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల రాజీనా మాల వ్యవహారంలో వారి ఒత్తిళ్లకు లొంగకూడ దని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

 

 

వారం రోజులు వ్యవధి ఇచ్చి, పరిస్థితిని అదుపు చేయలేని పక్షంలో ఆయన్ని తప్పించడం మినహా మరో మార్గం లేదని అధిష్టానం భావిస్తున్నదని, అందుకనుగుణంగానే ఈ రకంగా పావులు కదుపుతున్నదని అంటున్నారు. విజయనగరంలో దాడుల సంగతి తెలిశాకే అధిష్టానంలో కదలిక వచ్చినట్లు చెబుతున్నారు. అందులోనూ ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడికీ మధ్య పొరపొచ్చాలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తక్షణమే రంగంలోకి దూకి పరిస్థితిని నివారించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన తరుణంలో ఆయన ఏమీ పట్టీపట్టనట్లు వ్యవహరించారని హైదరాబాదు నుంచి నివేదికలు అధిష్టానానికి చేరినట్లు విశ్వసనీయ వర్గాల కథనం.

 

దిగ్విజయ్‌ నుంచి ఫోన్‌ వచ్చాకే ముఖ్యమంత్రిలో కదలిక వచ్చిందని, దాన్ని సీరియస్‌గా తీసుకుని మర్నాడే పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి గనక తాము ఆశిస్తున్న రీతిలో వారం రోజుల్లోపల సీమాంధ్రలో పరిస్థితిని చక్కదిద్దగలిగితే మొదటి పరీక్షను నెగ్గినట్లుగా భావిస్తామని, అదే క్రమంలో అసెంబ్లిలో బిల్లు తంతుని కూడా ఆయన దిగ్విజయంగా ముగించాల్సి ఉంటుందని, ఈ రెండింటిలో ఏది నిర్వహించలేకపోయినా తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేస్తామని అధిష్టానం నేతలు తమని కలిసిన తెలంగాణ నేతలతో చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles