High court permission jagan samaikya sankharavam meeting

high court permission Jagan samaikya sankharavam meeting, Jagan samaikya sankharavam meeting, ys jagan sankharavam in hyderabad, LB stadium, ysrcp, ys jagan

high court permission Jagan samaikya sankharavam meeting

జగన్ శంఖారావం సభకు కోర్టు అనుమతి

Posted: 10/16/2013 12:53 PM IST
High court permission jagan samaikya sankharavam meeting

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా నిరాహార దీక్ష చేసి , నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈనెల 19 న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. డీసీపీ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులను కొట్టివేసి, తమ సభకు అనుమతి మంజూరు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఈరోజు ఉదయం తీర్పు వెల్లడించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles