Sumoto case must be filed minister danam

Sumoto Case must be filed Minister Danam, , Danam nagendra fire on sonia ghat, UPA chairperson Sonia Gandhi, Telugu Desam Party, TDP, Sonia Ghat, TDP leaders build Sonia Ghat

Sumoto Case must be filed Minister Danam, , Danam nagendra fire on sonia ghat, TDP leaders build Sonia Ghat

కేసుపెట్టాలి : మంత్రి దానం

Posted: 10/16/2013 03:12 PM IST
Sumoto case must be filed minister danam

తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ.. అందులోభాగంగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఫోటోకు పూల మాల వేసి, సోనియా గాట్ అంటూ సమాది కట్టి తన నిరసనను తెలపటం జరిగింది. అయితే దీని పై సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఖండించలేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేల్చారు. సోనియా గాంధీ పై తిరుపతిలో టిడిపి నాయకులు నిరసన తెలిపిన విధానం పై ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి ఎందుకు స్పందించలేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

 

ఈ సంఘటనపై మంత్రి దానం మండిపడ్డారు. జాతీయ నేతలను కించపరిచే విధంగా, అసభ్యకరంగా కార్యక్రమాలు చేపడితే సుమోటో కింద కేసుకు పెట్టాలని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈరరోజు నెక్లెస్ రోడ్డులో ఆయన 'లాంగ్ లైవ్ సోనియాగాంధీ' అంటూ ర్యాలీ చేపట్టారు. ఆమె చిత్రపటానికి దిష్టి తీశారు. తమ నాయకులకు సమాధులు కడుతుండడం, చెప్పులు వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇలాంటి చర్యలతో ఓపిక నశించిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు పెట్టే విధంగా ఎస్ పిలకు ఆదేశాలివ్వాలని ఆయన అధికారులకు సూచించారు. తిరుపతిలో టిడిపి నాయకులు తెలిపిన నిరసన సంఘటనపై పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన సోనియా గాట్ ను గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేయటం జరిగింది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles