Two months salary advance for seemandhra employees

Seemandhra employees,salary advance,State bifurcation, Two months salary advance, APNGOs

Two months salary advance for seemandhra employees.

సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్స్

Posted: 10/22/2013 09:12 AM IST
Two months salary advance for seemandhra employees

తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో అన్ని శాఖల ఉద్యోగులు నిర్విరామంగా 66 రోజుల పాటు సమ్మె చేసి ఇటీవలే చర్చోప చర్చల తరువాత తాత్కాలికంగా సమ్మె విరమించి మళ్ళీ విధుల్లో చేరిన విషయం తెలిసిందే. ఈ సమ్మె కాలానికి సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు అందలేదు. దీంతో వారందరికి ఈ రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ఇఛ్చి, వాదాల పద్దతిలో రికవరీ చేసుకోవడానికి ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకరించింది. ఉద్యోగ సంఘాల నేతలు రెండు నెలల అడ్వాన్స్ కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.

దీనిపై పరిశీలన చేసిన ప్రభుత్వం అందుకు అంగీకరించి, ఈ మేరకు రూపొందించిన ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్ద ఫైల్ వెళ్లనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వకూడదంటూ 'నో వర్క్ నో పే` విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణ ఉద్యోగులు సమ్మె సమయంలో 177 జీ.ఓ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏదో ఒక మార్గంలో పనిచేయకున్నా జీతాలు పొందుతున్న ఉద్యోగులు వారి కుటుంబాలు హ్యాపీగానే ఉంటాయి. కానీ ఈ సమ్మె వలన నష్టపోయిన అనేక వర్గాల వారి నష్టాన్ని సీమాంధ్ర ఉద్యమ ఉద్యోగులు తీర్చగలరా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles