Mla ashok gajapathi raju insulted at vizianagaram pydithalli temple

mla ashok gajapathi raju insulted at vizianagaram pydithalli temple, pydithalli temple, vizianagaram pydithalli temple, tdp mla ashok gajapathi raju, Sirimanu Uthsavam from Vizianagaram, Sri Pydithalli Ammavaru Temple At Vijayanagaram, congress party,

mla ashok gajapathi raju insulted at vizianagaram pydithalli temple

అమ్మవారి సన్నిదిలో అశోక్ గజపతిరాజుకు అవమానం

Posted: 10/22/2013 01:12 PM IST
Mla ashok gajapathi raju insulted at vizianagaram pydithalli temple

తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల కాలంలో అవమానాలు ఎక్కువుగా జరుగుతున్నాయి. పార్లమెంట్లులో టిడిపి నాయకులు చేసిన హాడవుడి అంత ఇంత కాదు. అక్కడ తెలుగు వారి పరువును తీసిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి. అశోక్ గజపతి రాజుకు సొంత ఇలాకా విజయనగరంలో ఈరోజు ఉదయం అవమానం జరిగింది. సిరిమానోత్సవం సందర్భంగా అశోక్ గజపతి రాజు ఈ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు.

 

అయితే పోలీసు అధికారులు జ్యోకం చేసుకోని .. ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజును ఆలయంలోకి అనుమతించటంతో.. పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల చర్యపై అశోక్ గజపతి రాజు అమ్మవారి ఆలయం ఎదుట రోడుపై బైఠాయించి తన నిరసన వల్ల, అధిక సంఖ్యలో టిడిపి శ్రేణులు అక్కడికి చేరుకోవటం జరిగేది. దీంతో అమ్మ ఆలయం వద్ద పెద్ద రబాస జరిగేదని స్థానికులు, భక్తులు అంటున్నారు.

 

పైడితల్లమ్మవారి తొలేళ్ల ఉత్సవం ఈ రోజు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. అయితే దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో తొలిసారిగా 144 సెక్షన్ అమల్లో ఉండగా సిరిమానోత్సవం జరుగుతోంది. అయితే విజయనగరంలో పోలీసు ఆంక్షల నేపథ్యంలో గతేడాది కంటే సిరిమానోత్సవానికి హాజరయ్యే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

 

అమ్మ వారి ఆలయం వద్ద జరిగిన అశోక్ గజపతి రాజు అవమానం పై టిడిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక ప్రజా నాయకుడికే ఇలా జరిగితే. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని.. టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం టిడిపి నాయకులు పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టిడిపి నాయకులు మండిపడుతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles