Actor avs health is in critical condition

Actor AVS health is in Critical Condition!, Actor AVS Health Condition Serious, Actor AVS health condition critical

Actor AVS health is in Critical Condition! Actor AVS Health Condition Serious, Actor AVS health condition critical

నటుడు ఏవీఎస్ ను ఇంటికి తరలించిన కుటుంబ సభ్యులు

Posted: 11/08/2013 05:54 PM IST
Actor avs health is in critical condition

ప్రముఖ సినీ ఆర్టిస్టు.. హాస్య నటుడు ఎవిఎస్ ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఎవిఎస్ పదిరోజుల కిత్రమే హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.

 

అయితే చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయినట్లు గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. ఎవిఎస్ గత నాలుగు ఏళ్ల కిత్రమే కాలేయ మార్పిడి చేసుకున్నాడు. అయినా ఆ వ్యాధి మళ్లీ ముదిరినట్టు తెలుస్తోంది.

 

అయితే వైద్యుల సూచన మేరకు మణికొండలోని ఆయన ఇంటికి ఈరోజు సాయంత్రం తరలించారు. ప్రస్తుతం ఎవిఎస్ ఈ శుక్రవారం విడుదలయిన 'నేనేం చిన్న పిల్లనా' చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles