Two pccs chiefs in congress party ap

two pccs chiefs in congress party ap, Two PCC Chiefs In AP, Two PCC Chiefs In AP - High Command Planning, Congress party, botsa satyanarayana, d.sridhra babu, cm kiran,

two pccs chiefs in congress party ap, Two PCC Chiefs In AP - High Command Planning

ఇక నుండి ఇద్దరు పీసీసీలు?

Posted: 11/08/2013 10:27 PM IST
Two pccs chiefs in congress party ap

తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు రెండు వేర్వేరు పీసీసీలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చేలోపే రెండు పీసీసీలు ఏర్పడతాయని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు.

 

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలంటే ప్రాంతాలవారీగా పీసీసీలు అవసరం అని చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి కోసం పలువురు టీ కాంగ్రెస్ సీనియర్లు లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.

 

ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి హస్తిన పెద్దలతో వరుస భేటీలు జరుపుతున్నారు. దీంతో మరికొంతమంది నాయకులు కూడా హస్తినబాట పట్టారు. పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం కూడా ఢిల్లీలో జరుగుతోంది.

 

దీనికి దిగ్విజయ్ సింగ్, కుంతియా కూడా హాజరయ్యారు. రాష్ట్రం నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి దీనికి వెళ్లారు. రాష్ట్ర విభజనకు సహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర నాయకులను కోరనుందని సమాచారం. హైదరాబాద్ అంశం, జలవనరుల పంపిణీపై చర్చ జరుగుతుందని అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles