ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచిత ల్యాప్ టాప్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సర్కారు భావించింది. అంతే వెంటనే ల్యాప్ టాప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ల్యాఫ్ టాప్ ల పథకం ప్రభుత్వ కళశాలల్లో చదివారికే ఇవ్వటం జరుగుతుంది. అయితే ఉచిత ల్యాప్ టాప్ తెచ్చుకోవటానికి వెళ్లిన ఒక విద్యార్థి ని మంత్రి గారి ల్యాప్ టాప్ రేప్ చేసింది. అంటే మంత్రిగారి ల్యాప్ టాప్ .. ఆయన సొంత ల్యాప్ టాక్. మంత్రి రాక ఏడు గంటలు ఆలస్యం కావటంతోనే అమ్మాయి పై రేప్ జరిగినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో చోటు చేసుకుంది. ఫైజాబాద్ లో నిన్న మధ్యాహ్నం విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అవధేష్ ప్రసాద్ దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా వచ్చారు. దాంతో రాత్రి 10.30కి ల్యాప్ టాప్ లను విద్యార్థులకు మంత్రి పంపిణీ చేశారు. ఆ బాలిక ల్యాప్టాప్ తీసుకుని జీపులోలో తోటి విద్యార్థులతో పాటు స్వగ్రామమైన విశ్వంభరపట్ బయలుదేరింది. అందరినీ దించిన జీపు డ్రైవర్ ఆమెను మాత్రం దించకుండా ఊరి చివర పొలాల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం జరిపి, పరారయ్యాడు. దీంతో బాలిక తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది.దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. మంత్రి అవధేష్ ప్రసాద్ అంత ఆలస్యంగా రావడమే ఈ దారుణానికి కారణమని విశ్వంభర్ పట్ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు
.
మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన కార్యక్రమం, రాత్రి ఏడు గంటలకు మొదలైంది. మంత్రిగారు ల్యాప్ టాప్ ఇచ్చేటప్పటికి రాత్రి 11 అయింది. అయితే ఇక్కడ విద్యార్థుల కోసం అటూ ప్రభుత్వం గానీ, ఇటు కళాశాలల యాజమాన్యాలు కానీ విద్యార్థులకు రవాణా ఏర్పాటు చేయలేదు. ఆ సమయంలో విద్యార్థులకు రక్షణ లేకపోవటం, జీపు డ్రైవర్ కు కలిసి వచ్చిందని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు రంగంలోకి జీపు డ్రైవర్ కోసం వెతికే పనిలో పడ్డారు. దీనిపై మంత్రిగారు ఏమంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more