Minister dokka talking on seemandhra capital

minister dokka talking on seemandhra capital, kondaveedu, amaravathi, guntur,seemandhra capital,

minister dokka talking on seemandhra capital, kondaveedu, amaravathi, guntur,seemandhra capital,

సీమాంధ్ర రాజధాని కొండవీడు-అమరావతి మధ్య

Posted: 11/20/2013 11:03 AM IST
Minister dokka talking on seemandhra capital

రాష్ట్ర విభజన అనివార్యం అయిన నేపథ్యంలో మొన్నటి వరకు సమైక్యాంధ్ర జపం చేసిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు తన సొంత ప్రయోజనాలను వెతికే పనిలో పడ్డారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు రాజధానిని తమ జిల్లాల పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటి వరకు కొంత మంది నేతలు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని కోరితే మరికొందరు బెజవాడ, ఓంగోలు, తిరుపతి, కర్నూలు లను రాజధానిని చేయాలని ప్రతిపాదించారు.

ఇప్పుడు మంత్రి మాణిక్య వర ప్రసాద్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఒక వేళ విడిపోతే కొండవీడును సీమాంధ్రకు రాజధానిగా చేయాలని జీవోఎంకు సూచించినట్లు చెప్పారు. కొండవీడుపై రూపొందించిన సిడిని విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయలు, కవులను గుర్తు చేసే చారిత్రక నేపథ్యం ఉన్న కొండవీడు, అమరావతిని సీమాంధ్ర రాజధానిగా చేయాలని ప్రదిపాదించానని ఆయన అంటున్నారు. ఈయన చేస్తున్న ప్రతిపాదన పై ఆయన స్వలాభం చూసుకుంటున్నాడని అంటున్నారు. మరి గుంటూరు జిల్లాకిందకి వచ్చే ఈ ప్రాంతాల్లో ఈ మంత్రిగారి ఎన్ని ఆస్తులున్నాయో ? అందుకే ఈ ప్రతి పాదన చేసి ఉంటాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles