Divisionists should be put in jail says minister tg venkatesh

divisionists should be put in jail says minister tg venkatesh, minister tg venkatesh, ap bifurcation, congress party, cm post, telangana issue,

divisionists should be put in jail says minister tg venkatesh

నేనే ముఖ్యమంత్రినైతే.. మీ సంగతి?

Posted: 11/22/2013 02:50 PM IST
Divisionists should be put in jail says minister tg venkatesh

మనసులో కోరికను .. ఒక మంత్రి మీడియా ముందు ఇలా బయటపెట్టారు. అంటే ఆయనలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్నదని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఆయన కోరికలో కూడా అర్థం ఉందిలే. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా..రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. నల్లారి సారుని దించి, అమ్మకు అనుకులమైన వ్యక్తిని నియమించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే.. కొంతమంది సీమాంద్ర నాయకులకు అమ్మ ఆఫర్ ఇవ్వటం, వారు అమ్మ ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

 

ఈ విషయం తెలుసుకున్న మరికొంత సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి పదవి పై ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఇలా మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారో మీరే చదవండి.. రాష్ట్ర మంత్రి టిజీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పటానికి ఏం లేదు. ఎందుకుంటే ఆయన ఎప్పుడు మీడియాలోనే ఉంటాడు కాబట్టి. ఇప్పుడు కొత్తగా మన టీజీ సార్ కు సీఎం పదవిపై కోరిక కలిగింది. నాకు సీఎం పదవి ఇస్తే కనుక రాష్ట్ర విభజన కోరుకునే వారిని జైల్లో పెడతానని అంటున్నారు.

 

అయిన విభజన కోరుకుంటే జైల్లో పెట్టి ఏం చేస్తారో ఆయనకే తెలియాలి. లక్షలాది మందితో ఢిల్లీ వెళ్లితే విభజన ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీఎన్జీవోల నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఆ బిల్లును తిరస్కరించాలని తామంతా భావిస్తున్నామని చెప్పారు. అలాగే అసెంబ్లీని రద్దు పరిచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి టీజీ వెంకటేష్ వెల్లడించారు. అటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రిని చేయ్యండి. నేనేంటో నిరూపించుకుంటానని రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు..

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles