16 years boys behavior

16 years boys behavior, gang raps, nirbya, new rules,

16 years boys behavior

అబ్బాయికి 16 దాటితే?

Posted: 12/03/2013 12:28 PM IST
16 years boys behavior

ఇటీవల అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ ల సంఖ్య పెరిగిపోతున్నాయి. అయితే బాలుడు వయసు నుంచే..అమ్మాయిలపై రేప్ చేస్తున్నారు. అయితే 16 ఏళ్లకు పైబడిన 'బాలుర'ను కూడా యువకులుగా పరిగణించి విచారించాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి తీసుకోవడానికి వీలుగా ఒక నోట్‌ను కూడా తయారు చేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతిపాదనకు తుది రూపం వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

 

ఢిల్లీలో గత ఏడాది జరిగిన నిర్భయ గ్యాంగ్‌రేప్ ఘటనలో 16 ఏళ్ల 'బాలుడు' కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మిగిలిన నిందితులందరి కంటే అత్యంత క్రూరంగా ప్రవర్తించింది కూడా ఈ కుర్రాడే. అయితే, 18 ఏళ్లకులోపు ఉన్నవాళ్లంతా 'బాలురే' అన్న ఉద్దేశంతో అతడిని జువెనైల్ కోర్టుకు పంపారు. శిక్ష కూడా తక్కువగానే పడింది. బాల నేరస్తులుగా పరిగణించే వయసును 18 ఏళ్ల నుంచి తగ్గించాలన్న పిటిషన్లను సుప్రీం కోర్టు కూడా కొట్టివేసింది.

 

ఈ నేపథ్యంలోనే, నిపుణులతో విస్తృతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తాజా ప్రతిపాదనను రూపొందించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, 16-18 ఏళ్ల మధ్య వయస్కులను కూడా ఇతర నిందితుల తరహాలోనే విచారిస్తారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles