Shinde talk on rayala telangana

Shinde talk on Rayala Telangana, Chiranjeevi Meeting with Shinde, Rayala Telangana, Jairam on Hyderabad, telangana issue, sushil kumar shinde, congress party, telangana bill,

Shinde talk on Rayala Telangana

ఆ టి-గురించి నాకు తెలియదు: షిండే

Posted: 12/03/2013 03:00 PM IST
Shinde talk on rayala telangana

రాష్ట్ర విభజన పై కేంద్రంలో కసరత్తు చేస్తున్న వ్యక్తు ల్లో షిండే ఒకరు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ముందుకు తీసుకుపోవటానికి రాత్రి పగలు కష్టపడుతున్నారు. జీవోఎం సభ్యుల్లో ఒకరైన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ షిండే రాష్ట్ర విభజనపై ఎప్పటికప్పుడు హాట్ హాట్ ప్రకటనలు చేయటంలో సిద్దహస్తుడు. అలాంటి సిద్దహస్తుడే.. చిక్కు ప్రశ్న వేశారు మన మీడియా వారు. అసలే రాజకీయంలో తలపండిన షిండే.. మీడియా వారు వేసిన చిక్కు ప్రశ్నకు నవ్వుతూ సమాధానం చెప్పి అక్కడు నుండి వెళ్లిపోయాడు. ఇంతకీ షిండేను మన మీడియా వారు అడిగిన ప్రశ్న ఏమిటి? రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం.

 

అయితే షిండే .... రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏమీ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని... జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం.

 

ఈ సందర్భంలో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles