మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి నిత్యం మీడియాలోకి ఎక్కుతున్నాడు. జేసి తన ఇమేజ్ పెంచుకోవటానికి రోజుకోక రాజకీయ ప్రకటన చేసి, రాజకీయల్లో వేడి పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ పైనే విమర్శలు గుప్పింస్తున్నారు.ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యి. తెలంగాణ బిల్లు అసెంబ్లీ వస్తున్న తరుణంలో తెలంగాణ బిల్లును అడ్డుకోవటానికి సీమాంద్ర నాయకులు తీవ్రమైన క్రుషి చేస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు అందరూ కలిసి ఐక్యంగా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
విభజన బిల్లు అసెంబ్లీకి రావడం ఆలస్యమైతే సమైక్య ఆంధ్ర తీర్మానాన్ని ప్రతిపాదిస్తామన్నారు. సీమాంధ్ర నేతలెవరూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ను కలవాలని అనుకోవడంలేదని జెసి చెప్పారు. అసలు జేసి ఏమీ కోరుకుంటున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. రాష్ట్ర ముఖ్మమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర కోసం,చివరి వరకు పోరాటం చేస్తానని అంటున్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవటానికి నల్లారి సైన్యం సిద్దమవుతుంది. టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఈరోజు జై తెలంగాణ అంటూ నినాదాలతో మారుమ్రోగించారు. సీమాంద్ర నాయకులు కూడా జై సమైక్యంద్ర అంటూ నినాదాలు చేయటంతో.. అసంబ్లీలో కొద్ది సేపు నినాదాలతో నిండిపోయింది.
జేసి దివాకర్ రెడ్డి మాత్రం అన్ని పార్టీలో కలిసి ఐక్యంగా తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని చెబుతున్నారు. జేసి తో టిడిపి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మిగిలిన పార్టీల నాయకులు కలిసి వస్తారా? అనే అనుమానం అందరికి కలుగుతుంది. జేసి పై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హైకమాండ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. బొత్స పై జేసి ఘాటైన విమర్శలే చేయటం జరిగింది. అయితే జేసి పై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more