Mp siva prasad narada muni getup

mp siva prasad, MP Siva Prasad Narada Muni Getup, tdp mp siva prasad novel protest, sonia gandhi, sonia ap bifurcation, telugu desam party mp, mp sivaprasad turns narada bats for samaikyandhra, Siva Prasad novel protest in parliament, tdp mp n sivaprasad, actor siva prasad, andhra pradesh bifurcation, telangana bill, telangana draft bill, telangana war, telangana issue, protesting over telangana, political news, latest telugu news, breaking news, headlines

MP Siva Prasad Narada Muni Getup, mp sivaprasad turns narada bats for samaikyandhra

సోనియమ్మకు.. కోరడా దెబ్బలు, చిడతల సౌండ్?

Posted: 12/17/2013 01:16 PM IST
Mp siva prasad narada muni getup

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంద్ర నాయకులు ...రకరకాల నిరసనలు తెలుపుతున్నారు. అయితే సమైక్యాంద్ర కోసం పోరాడం చేస్తున్న నాయకుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కొత్త వింత పోకడలు అవలంబిస్తున్నారు. రీసెంట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు.. నన్నపనేని రాజకుమారి వింతగా నిరసరన తెలిపారు. అసెంబ్లీలో నన్నపనేని రాజకుమారి చనిపోయినట్లుగా పడుకోబెట్టి, టిడిపి నాయకులు నిరసన తెలపటం అందరికి తెలిసిందే.

అయితే అదే పార్టీ ఎంపీ శివప్రసాద్, ప్రభుత్వానికి నిరసన తెలపటంలో మంచి వేషాగాడు. తన విచిత్రమైన వేషలతో ఢిల్లోని పార్లమెంట్ స్పీకర్ మీరా కుమార్ కి ఆశ్చర్యం కలిగించిన ఘటన మన ఎంపీ శివప్రసాద్ ఉంది. కోరడాలతో కొట్టుకోవాలన్న, చిడతలు వాయించాలన్న .. తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ ఉండాలని రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఈరోజు రాష్ట్ర విభజనపై చిత్రవిచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు టిడిపి ఎంపి శివప్రసాద్‌ ఏకంగా నారదుడి అవతారమెత్తారు. నారదుడి అవతారంలో పార్లమెంట్‌కు వచ్చిన ఆయన చిడతలు వాయిస్తూ ... పాటలు పాడుతూ హడావుడి చేశారు. సీమాంధ్ర సమస్యలను ఏకరువు పెడుతూ .. హరికథ చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కోరారు.

భలే గొప్ప చిచ్చుపెడితివే.....

ఓ సోనియమ్మ ....

అన్నదమ్ములే అసెంబ్లీలో, పార్లమెంట్ లో తన్నుకునే చచ్చేలా

భలే గొప్ప చిచ్చుపెడితివే... భలే గొప్ప

ఉన్న రాష్ట్రాలు ఏలుకోక...ఊరుకే కూర్చోక

సీమాంధ్ర జనం శఠగోపం పెట్టినావు

 

రెండుసార్లు గెలిపిస్తే...రాష్ట్రం రెండు కావాలా?

రాహుల్ పదవి కోసం ...రాద్ధాంతం చేస్తావా?

భలే గొప్ప చిచ్చుపెడితివే.....

ఓ సోనియమ్మా .... అని రాగయుక్తంగా పాడారు.

 

ప్రజల కోసం కాదని .... తన కొడుకు కోసం సోనియాగాంధీ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టారని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలని... ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లేందుకే నారదుని అవతారంలో వచ్చినట్లు ఆయన చెప్పి....నారాయణ ...నారాయణ అంటూ వెళ్లిపోయారు. అయితే ఎంపీ శివప్రసాద్ నారదుని వేషం ఢిల్లీ మీడియాను విశేషంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ పెద్దలను మనసు మాత్రం కరిగించలేదనే విషయం అందరికి అర్థమైంది. అంటే సీమాంద్ర నాయకులే అమ్మకు భజన చేస్తుంటే.. ఇక సమైక్యాంద్ర ఎలా ఉంటుందని ఢిల్లీ పెద్దలు పబ్లిక్ గానే అంటున్నారు. పాపం ఎంపీ శివప్రసాద్ ఎన్ని వేషాలు వేసి, కోరడాలతో కొట్టుకున్న, చిడతలు వాయించినప్పటికి ఇక సమైక్యంద్రను చూడలేరని ఇతర రాష్ట్రాల పార్లమెంట్ ఎంపీలు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles