Telangana leaders unite irrespective of parties

telangana leaders unite irrespective parties, Kiran Kumar reddy, Minister Sridhara Babu, Telangana bill, Assembly Affairs Ministry

telangana leaders unite irrespective ot parties they belong

పార్టీలకు అతీతంగా తెలంగాణా నేతల సంఘీభావం

Posted: 01/03/2014 05:39 PM IST
Telangana leaders unite irrespective of parties

శాసన సభ్యలలో ప్రాంతీయంగా విభజన ఎలాగూ జరిగిపోయింది కాబట్టి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవటం కోసం పార్టీలకు అతీతంగా పోరాడదామని తెలంగాణా ప్రాంతాలకు చెందిన తెరాస, తెదేపా, కాంగ్రెస్, భాజపా ప్రజాప్రతినిధులంతా ఈ రోజు మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్ లో సమావేశమై తీర్మానం చేసారు. అలా ప్రజాప్రతినిధులందరినీ సమన్వయ పరచవలసిందిగా తాజాగా మంత్రి పదవినుంచి రాజీనామా చేసిన శ్రీధరబాబుని అందరూ కోరారు. 

సభ సజావుగా నడవనంత కాలం శాసన సభ స్పీకర్ ఎవరైనా శాసన సభ వ్యవహారాలు చూసేదెవరైనా ఒకటే.  అయితే ముఖ్యమంత్రి శాసనసభ వ్యవహరాల శాఖను తెలంగాణా మంత్రి శ్రీధరబాబు నుంచి తొలగించి సమైక్యాంధ్ర మద్దతు తెలిపే శైలజానాథ్ కి అప్పగించటంతో శాసన సభలో సమైక్యాంధ్ర తీర్మానాన్ని ప్రతిపాదనగా ప్రవేశపెడతారేమోననే భయంతో తెలంగాణా వాదులు, తెలంగాణా బిల్లు కాని చర్చకు వస్తుందేమోనన్న భయంతో సీమాంధ్ర నేతలు సభను ముందుకు సాగకుండా చేస్తున్నారు.

అయితే మరో సమస్య ఏమిటంటే తెలంగాణా బిల్లులోని కొన్ని అంశాలు తెలంగాణా నాయకులకు కూడా రుచించటం లేదు.  అందువలన సభ సాగక బిల్లు మీద చర్చ జరగనట్లయితే ముసాయిదా బిల్లులోని అభ్యంతరాల మీద లేఖ రాద్దామని ప్రజాప్రతినిధులు తీర్మానం చేసారు. 

పార్టీలకు అతీతంగా కూడిన ప్రజాప్రతినిధులందరినీ సమన్వయపరచి వీలయితే ఢిల్లీ వెళ్ళి అక్కడి పెద్దలకు అన్నీ వివరిద్దామని నిర్ణయించుకున్నామని శ్రీధరబాబు అన్నారు.  అలాగే, శాసన సభ వ్యవహారాల శాఖనుంచి తనని తప్పించిన సందర్భంగా తనకి సంఘీభావం తెలిపినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles