Ganta srinivas rao to get shokaz notice

Minister Ganta Srinivas Rao, Minister Ganta Srinivasa Rao, Chiranjeevi, Congress Showcause Notice

Ganta Srinivas Rao to get Shokaz notice.

గంటాకు షోకాజ్ ఇవ్వనున్న కాంగ్రెస్

Posted: 01/03/2014 08:59 PM IST
Ganta srinivas rao to get shokaz notice

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి ప్రదర్శిస్తూ తన పని తాను చేసుకొని పోతుంటే.... సొంత పార్టీకి చెందిన మంత్రలు, నేతలే ఆ పార్టీ అధినేత్రి ని అనరాని మాటలు అనడమే కాకుండా, తమ పార్టీ పై తామే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకొంత మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళేందుకు తెర వెనక రాజకీయాలు నడుపుతున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ అటువంటి నేతల పై చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఇప్పటికే మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసిన విషయం విదితమే. సోనియాగాంధీని విమర్శించినందుకే ఆయనకు ఆ నోటీస్‌ జారీ అయ్యింది. దానిపై ఆయన ఇంకా వివరణ ఇవ్వాల్సి వుంది. ఇప్పుడు చిరంజీవి మిత్రుడు, మంత్రి గంటా శ్రీనివాస రావుకు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం.

దీంతో పరుగో పరుగు అంటూ కేంద్ర మంత్రి చిరంజీవి వద్దకు వెళ్లిన గంటా ఆయనతో సమావేశం అయ్యి, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గకుంటే నేను టీడీపీలో చేరడం ఖాయం అని తేల్చి చెప్పాడట. దీంతో ఖంగుతిన్న చిరంజీవి గంటాను సముదాయించే పనిలో పడ్డారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తనకు దగ్గరి వారే ఇలా జలక్ లు ఇస్తుండంతో చిరంజీవికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles