Orphans sexually assaulted by tutor

Orphans sexually assaulted by tutor, Nalgonda tutor raped orphans, Hostel tutor sexual assault on orphans, Orphans raped in Nalgonda hostel

Orphans sexually assaulted by tutor

అనాధ బాలికల మీద ఆరు నెలలుగా అత్యాచారం

Posted: 01/04/2014 09:02 AM IST
Orphans sexually assaulted by tutor

అది నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం, ఏనెమీది తండా.  అందులో ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించిన అనాధాశ్రమం.  అనాధాశ్రమంలో చేరిన పిల్లలు ఉదయం పాఠశాలకు పోయి మధ్యాహ్నం 3.30 కి తిరిగి వస్తే వాళ్ళకి ట్యూషన్ చెప్పటానికో అధ్యాపకుడిని నియమించారు.  అతని పేరు రమావత్ హరీష్.  జూలై నుంచి ఉద్యోగంలో చేరిన హరీష్ అక్కడే భోజనం చేసి అక్కడే నివాసముంటున్నాడు.  33 బాలురు పడుకునే గదిలో వాచ్ మన్, 44 మంది బాలికలుండే గదిలో హరీష్ పడుకుంటున్నారు. 

బుద్ధి గడ్డితిన్న హరీష్ 10 సంవత్సరాలకు పైబడ్డ బాలికల మీద అత్యాచారం చెయ్యటం మొదలుపెట్టాడు.  ఒకరిద్దరు కాదు 12 మంది బాలికలను వరుసగా ఆరు నెలలనుంచి తన కామవాంఛకు బలిచేస్తున్నాడు. 

అయితే ఏ పాపమైనా ఎంతో కాలం దాగదు కాబట్టి హరీష్ పాపం పండే రోజు వచ్చింది.  అతను శలవుపెట్టి తన వూరు సూర్యాపేట పోయినప్పుడు బాలికలంతా ఊకుమ్మడిగా అతని స్థానంలో పాఠాలు చెప్పటానికి వచ్చిన ఆ ఆశ్రమం నిర్వాహకుడు శ్రీనివాస్ కి హరీశ్ ని తిరిగి రానివ్వద్దని, వస్తే తాము వెళ్ళిపోతామని చెప్పారు.  మగ పిల్లల ముందు చెప్పటానికి బిడియ పడ్డ బాలికలు వాళ్ళని బయటకు పంపిన తర్వాత హరీష్ తమ నిద్ర చెడగొడుతున్నాడని చెప్పారు.  దీనివెనక ఏదో వాళ్ళు చెప్పలేని కథే ఉన్నదని గ్రహించిన శ్రీనివాస్ ఒక్కొక్కరితో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు రిపోర్ట్ ఇవ్వగా వాళ్ళు హరీశ్ ని సూర్యాపేటలో అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. 

నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకరావు మాట్లాడుతూ నేరస్తుడి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  బాధితులను నల్గొండ కేంద్ర హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తరలించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles