Bjp wins 300 seats

vinkayya naidu, bjp comments, bjp conducted cricket matches in nellore

bjp wins 300 seats - vebkayya naidu

గెలుపు ధీమాలో బిజెపి

Posted: 01/13/2014 11:48 AM IST
Bjp wins 300 seats

అవినీతి ఆరోపణల్లో నిండా మునిగి పోయిన కాంగ్రెస్ ను రాబోయే ఎన్నికలో మట్టకరిపిస్తామనే ధీమాలో బిజెపి జోగులాడుతోంది.. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో చతికిల పడిన కాంగ్రెస్ ను అదును చూసి దెబ్బ కొట్టాలని బిజెపి భావిస్తోంది.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో చిత్తుగా ఓటమిపాలైన కాంగ్రెస్ ను గద్దె దించేందుకు బిజెపి పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయడు వ్యాఖ్యానిస్తూ వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 300 సీట్లు సాధిస్తుందని అన్నారు.. నెల్లూరులో భాజపా నిర్వహిస్తున్న క్రకెట్ పోటీలను ప్రారంభిం చేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నకల్లో తాను బౌలింగ్ మాత్రమే చేస్తానని, బ్యాటింగ్ ను నరేంద్రమోడీ చేస్తారని అన్నారు.

అలాగే రాబోయే ఎన్నికల్ల నరేంద్ర మోడీ త్రబుల్ సెంచరీ చేయడం ఖాయమన్నారు.. దేశంలోని యువతకు నరేంద్ర మోడీ ఆశాకిరణంలో ఉన్నారని వెంకయ్య నాయుడు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.. అదే విధంగా రాష్ర్ట విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ చిన్న రాష్ర్టాలను బిజెపి మాత్రమే ఇవ్వగలదని, ఇచ్చిన మాటకు బిజెపి కట్టుబడి ఉంటుందన్నారు.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles