Veteran actress anjali devi died in chennai

Veteran Actress Anjali Devi,anjali devi passed away, film star anjali devi, actress anjali devi

Veteran actress anjali devi died in Chennai. Anjali Devi pass away, anjali devi died,

అందాల నటి అంజలి దేవి ఇక లేరు

Posted: 01/13/2014 03:16 PM IST
Veteran actress anjali devi died in chennai

అలనాటి ప్రముఖ నటి అంజలీ దేవి అంజలీ దేవి నేడు చెన్నయ్ లో కన్ను మూశారు.  ఈ మెకు 86 సంవత్సరాలు. లవకుశ సినిమాలో  ఈమె సీతాదేవిగా నటించి ఎందరో అభిమానులను  సంపాదించుకున్నారు.  ఎన్ టి ఆర్, ఎన్ ఆర్ లతో పాటు అనేక మంది ప్రముఖ నటులతో నటించిన అంజలీ దేవి మేటి నటిగా గుర్తంపు పొందారు. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం లో జన్మించిన అంజలీ దేవికి చిన్నతనంలో అంజని దేవిగా నామకరణం చేశారు.

అయితే సినిమాల్లోకి వచ్చిన అనంతరం  ఆమె పేరును దర్శకుడు సి పుల్లయ్య అంజలీదేవిగా మార్చారు. 1936లో తొలిసారిగా రాజా హరిశ్చంద్ర సినిమాలో  అంజలీ దేవి నటించారు. అంజలీ దేవి 350 తెలుగ సినిమాల్లోనూ, కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. సంగీత దర్శకుడు ఆది నారాయణరావును  1940లో వివాహం చేసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్న అంజలీ దేవి చెన్నయ్ లోని విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆమె కు ఇద్దరు కుమారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles