How many trs leaders sacrificed for telangana tdp questions

how many TRS leaders sacrificed for Telangana,TDP questions, Errabelli Dayakar, KCR, TRS party,

how many TRS leaders sacrificed for Telangana TDP questions

అమరులైనవారిలో తెరాస వారెంతమంది- తేదేపా ప్రశ్న

Posted: 01/21/2014 04:08 PM IST
How many trs leaders sacrificed for telangana tdp questions

తెలంగాణా వాదం ఎప్పుడు వచ్చినా వేలాదిమంది ప్రాణత్యాగాలు చేసారు, అమరులయ్యారు అని అంటుంటారు, వారిలో తెలంగాణా కోసమే ఆవిర్భివించిందని చెప్పుకుంటున్న తెరాస వాళ్ళెవరైనా ఉన్నారా అంటూ తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ ప్రశ్నించారు. 

వేలాది మంది అసువులుబాసారంటే దానికి కారణం తెరాస అధినేత కెసిఆర్ అని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యటం వలనే అమాయకులు ప్రాణాలు తీసుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.  బూటకపు ఉద్యామాలు చేసి విద్యార్థుల ప్రాణాలు తీసిందే కాకుండా, చివరకు కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చేసిన వాగ్దానాన్ని కూడా విస్మరించి తాత్సారం చేసి తద్వారా తెలంగాణా బిల్లుని కూడా ఆలస్యమయ్యేట్టుగా చేసారన్న ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పారాయన. 

అలా విలీనం చెయ్యకపోవటానికి కారణం అధికారం పదవుల మీద కెసిఆర్ కి ఉన్న కాంక్షేనని, అయితే తనకి ఎటువంటి పదవీ వద్దని అన్న కెసిఆర్ ఆ విషయాన్ని కూడా మర్చిపోయారని అన్నారు ఎర్రబెల్లి. 

తెలంగాణా బిల్లు మీద జరుగుతున్న చర్చలో, ఆత్మహత్యలకు తెదేపా ఏ సంబంధమూ లేదని, ఉన్న సంబంధమంతా తెరాస వలన, కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన బూటకపు ఉద్యమాల వలనే జరిగాయని కెటిఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఎర్రబెల్లి తన ప్రసంగంలో.  

తెరాస లాగా కాకుండా తెదేపా సమన్యాయం కోసమే పోరాడుతోంది తప్ప తెలంగాణాకు వ్యతిరేకం కాదని ఎర్రబెల్లి సభాముఖంగా తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles